Home /News /movies /

POPULAR TELUGU CINEMA EDITOR GOUTHAM RAJU PASSED AWAY SR

Editor Goutham Raju Passed Away : ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత..

Editor Goutham Raju Passed Away Photo : Twitter

Editor Goutham Raju Passed Away Photo : Twitter

Editor Goutham Raju Passed Away : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (68) కన్నుమూశారు (Editor Goutham Raju). గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్యాస విడిచారు.

ఇంకా చదవండి ...
    సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్‌ గౌతంరాజు (68) కన్నుమూశారు (Editor Goutham Raju). గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు పరిస్థితి విషమించడంతో తుదిశ్యాస విడిచారు (Editor Goutham Raju Passed Away). గౌతంరాజు తెలుగులో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. గౌతంరాజు దాదాపుగా 850 సినిమాల వరకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేసి తన మార్క్ చూపించేవారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసుగుర్రం, బలుపు, బద్రీనాథ్, డాన్ శీను, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు.

    గౌతంరాజు 1982లో నాలుగు స్తంభాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన 1954 జనవరి 15న ఏపీలోని ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. ప్రముఖ తెలుగు దర్శకుడు జంధ్యాల తొలి చిత్రమైన నాలుగు స్తంభాలాట చిత్రంతో గౌతం రాజు ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు పనిచేశారు.

    Editor Goutham Raju Passed Away, Editor Goutham Raju movies, Editor Goutham Raju videos, Editor Goutham Raju family, Editor Goutham Raju news, Editor Goutham Raju awards, ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత, ఎడిటర్‌ గౌతంరాజు సినిమాలు
    బి గోపాల్, కోటి, మోహన్ బాబులతో ఎడిటర్ గౌతమ్ రాజు Photo : Facebook


    రజనీకాంత్, దళపతి.. మోహన్ బాబు, అసెంబ్లీ రౌడీ.. వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఎడిటింగ్ చేశారు. చివరగా ఆయన మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియాకు ఎడిటర్‌గా చేశారు. తన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డ్‌లను, రివార్డ్‌లను అందుకున్న ఎడిటర్ గౌతంరాజుకు సంధ్య, సుమాంజలి అనే ఇద్దరు పిల్లలున్నారు. గౌతంరాజు ఆరోగ్య పరిస్థితి ఇవాళ ఉదయం ఇంకాస్త క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయినట్లు (Editor Goutham Raju Passed Away) సమాచారం.

    Editor Goutham Raju Passed Away, Editor Goutham Raju movies, Editor Goutham Raju videos, Editor Goutham Raju family, Editor Goutham Raju news, Editor Goutham Raju awards, ఎడిటర్‌ గౌతంరాజు కన్నుమూత, ఎడిటర్‌ గౌతంరాజు సినిమాలు
    ఎడిటర్‌గా గౌతమ్ రాజు చేసిన కొన్ని సినిమాలు Photo : Facebook


    గౌతం రాజు 68 ఏళ్ల వయసులో కిడ్నీ, శ్వాస సంబంధ సమస్యలతో మరణించారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. గౌతం రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ.. గౌతం రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు