హోమ్ /వార్తలు /సినిమా /

పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ..ఓ సీన్ కోసం 37 టేకులు

పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ..ఓ సీన్ కోసం 37 టేకులు

రమ్యకృష్ణ Photo: facebook.com/ramyakrishnanofficial

రమ్యకృష్ణ Photo: facebook.com/ramyakrishnanofficial

రమ్యకృష్ణ నరసింహా సినిమాలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామి.. వంటీ పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటించింది తెలిసిందే. అయితే ఆమె కొత్త సినిమా సూపర్ డిలక్స్‌లో పోర్న్ స్టార్‌గా అదరగొట్టానని..ఓ సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్నానని.. తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇంకా చదవండి ...

  రమ్యకృష్ణ తెలుగు, తమిళ సినిమాలతో ఎంతో పాపులారిటీ పొందింది. అంతేకాకుండా.. 'బాహుబలి'లో 'శివగామి' పాత్రను చేసిన దగ్గర నుంచి రమ్యకృష్ణ పాపులారీటి మరింత పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత నుండి..ఆమెకు మళ్లీ సినిమా అవకాశాలు పుంజుకున్నాయి. దాంతోపాటు.. బాహుబలి సినిమా తర్వాత నుండి  విభిన్నమైన కథలను ఎంచుకుంటోంది రమ్యకృష్ణ. అందులో భాగంగా.. ఆమె తమిళంలో 'సూపర్ డీలక్స్'  అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు విజయ్ సేతుపతి .. సమంత ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్‌గా అలరించనున్నారు. నటిగా అపారమైన అనుభవమున్న రమ్యకృష్ణ, ఈ సినిమాలో ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్నారట. ఇప్పుడు ఈ విషయమే తమిళ సినిమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై రమ్యకృష్ణ మాట్లాడుతూ.. 'ఇది నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్‌ అని .. కొన్ని పాత్రలు పేరు కోసం చేస్తాం... మరీ కొన్ని పాత్రలు డబ్బుకోసం .. ఇంకొన్ని.. పాత్రలను సినిమాపై ప్యాషన్‌‌తో చేస్తాము ..ఈ సినిమాలో నా పాత్ర అలా  ప్యాషన్ తో చేసినది అన్నారు.


  రమ్యకృష్ణ
  రమ్యకృష్ణ   Photo: facebook.com/ramyakrishnanofficial


  ఇంకా ఆమె ఈ చిత్రం గురించి..తన పాత్ర గురించి మాట్లాడుతూ.. సూపర్‌ డీలక్స్‌’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని చూసి సెట్‌లో ఉన్నవారు షాకయ్యారని అన్నారు.  అయితే ఈ సన్నివేశం గురించి ఇప్పడు చెప్పడం కుదరదని.. దాన్ని..సినిమాలోనే చూడాలన్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది.  ఇందులో నేను వేశ్య పాత్రలో నటించానని... ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఓ ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తు. సినిమాలో నేను నటించాల్సిన ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నాని.. ఆ సన్నివేశం పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టిందన్నారు. అయితే నేను ఆ సీన్ చేస్తుంటే.. అది చూసి నాకంటే.. నా అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారే షాకయ్యారని చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.  మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ  సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆమె అన్నట్లుగానే.. రమ్యకృష్ణ ట్రైలర్‌లో అదరగొట్టారు.


  మతులుపోగొడుతున్న లక్ష్మీ రాయ్ అందాలు

  First published:

  Tags: Ramya Krishna, Tamil Film News, Telugu Cinema

  ఉత్తమ కథలు