జబర్ధస్త్ సుడిగాలి సుధీర్‌తో ప్రజా గాయకుడు గద్దర్.. ఎందుకో తెలుసా..

జ‌బ‌ర్ద‌స్త్ అనేది కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ ..సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఒక పాట పాడటమే కాదు.. నటించడం విశేషం.

news18-telugu
Updated: July 31, 2019, 5:50 PM IST
జబర్ధస్త్ సుడిగాలి సుధీర్‌తో ప్రజా గాయకుడు గద్దర్.. ఎందుకో తెలుసా..
ప్రజా గాయకుడు గద్దర్,సుడిగాలి సుధీర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
జ‌బ‌ర్ద‌స్త్ అనేది కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్క‌రు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్, రంగ‌స్థ‌లం మ‌హేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ షోకే కాకుండా ‘ఢీ’ వంటి రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.  ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా ప్రముఖ  పారిశ్రామిక వేత్త కే.శేఖర్ రాజు ప్రొడక్షన్ నెం. 1గా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్  సరసన ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది.

popular telangana folk singer gaddar sing a song in a jabardasth sudigali sudheer new movie software sudheer movie,jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer gaddar,gaddar,gaddar sing a song in sudigali sudheer software sudheer,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా,సాఫ్ట్‌వేర్ సుధీర్,సాఫ్ట్‌వేర్ సుధీర్,సుడిగాలి సుధీర్ ప్రజా గాయకుడు గద్దర్,సాఫ్ట్‌వేర్ సుధీర్ ప్రజా గాయకుడు గద్దర్,సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్ పాట,
గద్దర్,సుడిగాలి సుధీర్ (ఫైల్ ఫోటోస్ )


ఈ చిత్రం కోసం ప్రజా గాయకుడు గద్దర్ ఒక పాటను రచించి పాడటమే కాకుండా.. ఆ సాంగ్‌లో నటించడం విశేషం. ఈ  చిత్రంలో  ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌, పోసాని కష్ణమురళి ముఖ్య పాత్రల్లో  నటించారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నహాలు మొదలైయ్యాయి. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ - ''సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రంలో 'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో' అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నానన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్,సుడిగాలి సుధీర్ (ఫైల్ ఫోటోస్)
మరోవైపు హీరో  హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ - ''కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించించి ఈ క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం దొరికింది. మా సినిమాలో గద్దర్‌ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుందన్నారు.
First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు