చిత్రసీమలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ టెలివిజన్ నటి ఉమా మహేశ్వరి (40) కన్నుమూశారు (TV actress Uma Maheshwari passes away). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం చైన్నైలో తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ టీవీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. పలువురు తమిళ టీవీ పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఉమా మహేశ్వరి (Uma Maheshwari )`మొట్టి ఒళి` టీవీ సీరియల్ ద్వారా మంచి చాలా పాపులర్ అయ్యారు. అంతేకాదు `ఒరు కథైయిన్ కథై`, `మంజల్ మహిమై` వంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి తమిళ టీవీ ప్రేక్షకులుకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైయారు.
నటి ఉమా మహేశ్వరి (Uma Maheshwari) ఓ వైపు పలు సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లోనూ మంచి పాత్రలు చేశారు. అందులో ముఖ్యంగా `వెట్టిచాకిరి`, `కొడికట్టు`, `అల్లి అర్జున్` వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఉమామహేశ్వరి భర్తపేరు మురుగన్. ఆయన పశువైద్యుడుగా పనిచేస్తున్నారు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు.
#BREAKING | மெட்டி ஒலி தொடர் மூலம் புகழ்பெற்ற நடிகை உமா மகேஷ்வரி உடல்நலக்குறைவால் இன்று சென்னையில் காலமானார். அவருக்கு வயது 40#SunNews | #MettiOli | #UmaMaheshwari pic.twitter.com/uUNaDjKAoF
— Sun News (@sunnewstamil) October 17, 2021
అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు నటి ఉమా మహేశ్వరికి కొన్ని నెలల క్రితం కామెర్లు సోకాయట. చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకుంది. అయితే ఇటీవల ఆమె మళ్లీ కామెర్లు బారిన పడింది. ఆరోగ్యం మెరుగపడకపోవడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఉమా మహేశ్వరి ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Television News, Tollywood news