ప్రముఖ నటుడు రాజశేఖర్ కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ..

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజశేఖర్(62) ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

news18-telugu
Updated: September 9, 2019, 10:06 AM IST
ప్రముఖ నటుడు రాజశేఖర్ కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ..
తమిళ నటుడు రాజశేఖర్ (Photo: Instagram)
  • Share this:
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజశేఖర్(62) ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. పలైవనచోలై, చిన్నపూవే మెల్ల పెసు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అయిన రాజశేఖర్ తొలిసారి భారతీరాజా దర్శకత్వం వహించిన నిగల్‌గల్ (1980) చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సహచర్యంతో దర్శకుడిగా మారారు. ఒరు తాలై రాగం, మనసుక్కుల్ మతప్పు వంటి చిత్రాలు ఈ కాంబినేషన్‌కు మంచి పేరు తెచ్చాయి. రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు. దీంతో రాజశేఖర్ మళ్లీ నటన వైపు వచ్చారు.

కాగా, శరవణన్ మీనాక్షి సీరియల్‌లో హీరో తండ్రి పాత్రలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో అప్పట్నించి ఆయన ఎక్కువగా తమిళ టీవీ సీరియల్స్‌కే పరిమితమవుతూ వచ్చారు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సంతాపం ప్రకటించారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు