హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ,బోయపాటి సినిమాకు ఆ స్టార్ హీరోయిన్ ఓకే చెబుతుందా..

బాలకృష్ణ,బోయపాటి సినిమాకు ఆ స్టార్ హీరోయిన్ ఓకే చెబుతుందా..

బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం (Twitter/Photo)

బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం (Twitter/Photo)

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొలిక్కి వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో హీరోతో సమానమైన మరో పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కోసం ముందుగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను..

ఇంకా చదవండి ...

అవును గతేడాది తన తండ్రి జీవితంపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. క్రిటిక్స్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ  చిత్రం కమర్షియల్‌గా ఫెల్యూర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు తర్వాత ఇయర్ ఎండ్‌లో చేసిన ‘రూలర్’ కూడా బాలయ్యకు హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొలిక్కి వచ్చాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ భామ.. బాలకృష్ణతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించింది.

Boyapati Srinu planning budget control for Nandamuri Balakrishna movie and Shooting starts from june pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
ఎన్టీఆర్ కథానాయకుడులో బాలకృష్ణ,రకుల్ ప్రీత్ సింగ్ (Twitter/Photo)

మరోవైపు ఇంకో హీరోయిన్‌గా కేథరిన్ థెరిసాను అనుకుంటున్నారు. వీళ్లిద్దరితో పాటు   ఈ సినిమాలో హీరోతో సమానమైన మరో పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కోసం ముందుగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను రోజాను సంప్రదించగా.. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. దీంతో ఈ పాత్ర కోసం విజయశాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు.ఇక విజయశాంతి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. అందుకే బోయపాటి శ్రీను .. విజయశాంతిని కలిసి ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్‌ గురించి  విడమరిచి చెప్పాడట. ఇక వెండితెరపై విజయశాంతి, బాలకృష్ణ జోడికి మంచి క్రేజే ఉండేది. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా.. 17 చిత్రాల్లో జోడిగా నటించారు.

jabardasth judge cum mla roja rejected balakrishna boyapati srinu movie will vijayashanti accept this charecter,roja,vijayashanti,roja vijayashanti,balakrishna nandamuri,boyapati srinu,balayya,nbk,balakrishna roja vijayashanti,balakrishna roja,balakrishna vijayashanti,roja jabardasth comedy show,roja twitter,roja facebook,roja instagram,vijayashanti facebook,vijaya shanti twitter,vijayashanti instagram,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,tollywood,telugu cinema,బాలకృష్ణ,రోజా,విజయశాంతి,బాలకృష్ణ విజయశాంతి రోజా,విజయశాంతి రోజా,బాలకృష్ణ రోజా,బాలకృష్ణ విజయశాంతి,బాలకృష్ణ బోయపాటి శ్రీను విజయశాంతి,
విజయశాంతి,బాలకృష్ణ (File/Photos)

మొదటి సారి ‘కథానాయకుడు’ సినిమాలో వీళ్లిద్దరు హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. ఆ తర్వాత ‘పట్టాభిషేకం’,‘ముద్దుల కృష్ణయ్య’, ‘దేశోద్దారకుడు’, ‘అపూర్వ సహోదరులు’,‘భార్గవ రాముడు’, ‘సాహస సామ్రాట్’, ‘మువ్వ గోపాలుడు’,‘భానుమతి గారి మొగుడు’, ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ ‘భలే దొంగ’,‘ముద్దుల మావయ్య’,ముద్దుల మేనల్లుడు’, ‘లారీ డ్రైవర్’, ‘తల్లి తండ్రులు’,‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, వివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు. వీటిలో 80శాతం పైగా సినిమాలు సక్సెస్ సాధించాయి. కానీ ఇపుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ సినిమాలో విజయశాంతి ఓకే చెబితే.. అందులో బాలకృష్ణ సరసన నటిస్తుందా..? లేకపోతే వేరే పవర్‌ఫుల్ పాత్రలో యాక్ట్ చేస్తుందా అనేదా చూడాలి. మొత్తానికి బాలయ్య, బోయపాటి సినిమాకు విజయశాంతి ఓకే చెబితే మాత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులు మరోసారి వీళ్లిద్దరిని ఒకే తెరపై చూడొచ్చన్న మాట.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Rakul Preet Singh, Roja, Telugu Cinema, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు