పాటే ప్రాణంగా బతికాడు.. తన తియ్యటి గాత్రంతో కోట్ల మందికి శ్రావ్యానందం పంచాడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడిగా కొనసాగుతూ.. చివరికి పాటలు పాడుతూనే ప్రాణాలు కోల్పోయాడు.. కేకేగా ప్రసిద్ధుడైన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (KK) హఠాన్మరణం చెందారు. (Singer KK Died) దాదాపు అన్ని భారతీయ భాషల్లో కేకే పాటలు పాడి ఉండటంతో యావత్ దేశం ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనైంది. కేకే మృతికి ప్రధాని మోదీ, దేశ ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కేకే అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్‌లను అందించారు. మంగళవారం రాత్రి కోల్‌కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన తరువాత.. ది గ్రాండ్ హోటల్‌లో గుండెపోటుకు గురయ్యారు. దీంతో
View this post on Instagram
Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 31, 2022
మ్యూజిక్ కాన్సర్ట్ లో పాటలు పాడిన కాసేపటికే హోటల్ గదిలో కుప్పకూలిపోయిన కేకేను ఆయన సహాయకులు, కార్యక్రమ నిర్వాహకులు హుటాహుటిన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. చనిపోడానికి కొద్ది నిమిషాల ముందు కేకే తన లైవ్ ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు.
కేకే ఆగస్టు 23, 1968 న ఢిల్లీ లో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు. అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కిరోరి మాల్ కళాశాలలో సాగింది. 1996 నుంచి గాయకుడిగా కొనసాగుతోన్న కేకే.. తెలుగులో పాడిన చాలా పాటలు హిట్ అయ్యాయి.
‘కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పాటలు అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబింపజేస్తాయి. అన్ని వయసుల వారి మనసులను తాకుతాయి. ఆయన పాటల ద్వారా కేకేను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కేకే కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bolllywood, Kolkata, Playback, Tollywood