G Anand passes away : కరోనాతో కన్నుమూసిన మరో ప్రముఖ తెలుగు సింగర్..

G. Anand Photo : Twitter

G Anand passes away : కరోనాతో మరో గాయకుడు కన్నుముశారు. 2021లో కూడా సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి.

  • Share this:
    కరోనాతో మరో గాయకుడు కన్నుముశారు. 2021లో కూడా సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహమ్మారి కరోనా వలన ప్రముఖ తెలుగు సింగర్ జి. ఆనంద్ కన్నుమూశారు. సీనియర్ గాయకుడు జి.ఆనంద్(67) కరోనాతో కన్నుమూశారు. జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది. జి. ఆనంద్ గత ఐదు దశాబ్దాలుగా సినీ రగంలో కొనసాగుతూ స్వర మాధురి’ బృందం ద్వారా అమెరికాతో పాటు ప్రపంచమంతటా 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. వారి పిల్లలు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. జి. ఆనంద్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామంలో జన్మించారు. ఆయన ముఖ్యంగా 'ఒక వేణువు వినిపిం చెను' (అమెరికా అమ్మాయి), 'దిక్కులు చూడకు రామయ్య.., 'విఠలా విఠలా పాండురంగ విఠలా..' వంటి సూపర్‌ హిట్‌ పాటలను పాడారు. అంతేకాదు ప్రాణం ఖరీదు', 'మనవూరి పాండవులు', 'మా బంగారక్క', 'చక్రధారి', 'తాయారమ్మ -బంగారయ్య' తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు. సీరియల్స్‌కు, అనువాద చిత్రాలకు సంగీత సారథ్యం కూడా వహించారు ఆనంద్. ఆయన మృతి తోటి సింగర్స్‌కు షాకింగ్‌గా మారింది. ఆనంద్ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక కరోనా బారిన పడి మరో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

    ఇక తాజాగా సినీ నటుడు ప్రముఖ తమిళ కమెడియన్‌ పాండు(74) కరోనాతో కన్నుమూశారు. కమెడియన్‌ పాండు గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడందో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే మరో తమిళ కమిడియన్ వివేక్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. అయితే వివేక్ కూడా కరోనా సోకి మరణించినట్లు తమిళ చిత్రసీమలోని కొందరు పేర్కోన్నసంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: