అలా..వారు నన్ను వాడేసుకునేవారు..దీపిక పదుకొణె వ్యాఖ్యలు

నిన్న ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి దీపిక పదుకొణె హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడుతూ..తన చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 27, 2019, 7:15 AM IST
అలా..వారు నన్ను వాడేసుకునేవారు..దీపిక పదుకొణె వ్యాఖ్యలు
దీపిక పదుకొనే
  • Share this:
నిన్న ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి దీపిక పదుకొణె హాజరయ్యారు. ఈ వేడుకలో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుతో సన్మానించింది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. ‘నేను ముంబయి నగరంలో నివసిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాని.. ఈ నగరం నాకెంతో ఇచ్చింది అని అన్నారు. ‘మరి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..’ అని అక్కడి మీడియా దీపికను ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ ఒకవేళ నేను రాజకీయాలోకి వస్తే మాత్రం తప్పకుండా స్వచ్ఛభారత్‌ మంత్రిని అవుతానని చెప్తూ... నా చిన్నప్పుడు మా బంధువుల ఇంటికి వెళితే నన్ను అక్కడే ఉంచేసుకునేవారు. దాంతో నేను చాలా పాపులర్‌ అయిపోయాను అని ఫీలయ్యేదాన్ని. కానీ తర్వాత తెలిసింది.. నాకు శుభ్రత ఎక్కువని, వారి బెడ్‌రూంలు, వార్డ్‌రోబ్‌లు శుభ్రం చేయడానికి నన్ను ఉంచేసుకునేవారని.. అలా వాడేసుకునేవారని చెప్పుకొచ్చింది.
దీపికా పదుకొనే లేటెస్ట్ ఫోటోస్
First published: February 27, 2019, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading