• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • POPULAR FILM DIRECTOR RAJAMOULI ON RRR MOVIE AND THE INSPIRATION FOR THE FILM EXPLAINED SR

RRR ఐడియా... ఆ సినిమా నుండి వచ్చిందే : రాజమౌళి

RRR ఐడియా... ఆ సినిమా నుండి వచ్చిందే : రాజమౌళి

రాజమౌళి ఫైల్ ఫోటో

బాహుబలి తర్వాత.. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల గురించి ఇటీవల ప్రెస్‌మీట్‌లో రాజమౌళి తెలిపారు. అందులో భాగంగా..ఈ సినిమాకు ప్రేరేపించిన విషయాన్ని కూడా వెల్లడించారు..రాజమౌళి.

  • Share this:
    బాహుబలి తర్వాత.. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల గురించి ఇటీవల ప్రెస్‌మీట్‌లో రాజమౌళి తెలిపారు. ఈ చిత్రం అల్లూరి సీత‌రామ‌రాజు, కొమురం భీం నిజమైన క్యారెక్టర్‌తో ఉండీ.. ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించునున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న హిందీ నటి అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామడైసీ ఎడ్జర్ జోన్స్‌ నటించనున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో సముద్రఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ కనిపించనున్నారు.

    RRR ప్రెస్‌మీట్  Photo: Twitter/RRRMovie


    అయితే ఓ ప్రశ్నకు సమాదానంగా..రాజమౌళి మాట్లాడుతూ.. కొద్ది సంవ‌త్సరాల క్రితం 2004లో వ‌చ్చిన ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’ సినిమా చూశానని.. ఆ సినిమాలో షే అనే వ్యక్తి గురించి కథ సాగుతుంటుందని..అయితే క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఉంటుంది. అదీ చాలా బాగుందన్నారు. అలానే ఈ సినిమాలో కూడా రాజు అనే కుర్రాడి గురించి చెప్పి, అతనే తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. అలాగే అల్లూరి, కొమరం భీమ్‌ ఇద్దరు ఇంచుమించు ఒకే కాలానికి చెందినవారు కావడం, ఒకేసారి ఎక్కడికో వెళ్లిపోవడం, తిరిగొచ్చిన తర్వాత ఇద్దరు గెరిల్లా వార్‌లా ఫైట్‌ చేయడం... ఇది అద్భుతమైన ఆలోచన అనిపించిందని... అలా ఈ సినిమా వచ్చిందని రాజ‌మౌళి అన్నారు.

    RRR హీరోయిన్ బర్త్‌డే స్పెషల్...రెడ్ కార్పెట్‌పై అందాల ఆలియా భట్ ఫోటోస్

    First published:

    అగ్ర కథనాలు