• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • POPULAR DIRECTOR RAJAMOULI MULTI STARRER RRR MOVIE DETAILS WILL BE REVEALING ON MARCH 14 SAYS REPORTS SR

మార్చి 14న తేలనున్న రాజమౌళి RRR భవితవ్యం...అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి

మార్చి 14న తేలనున్న రాజమౌళి RRR భవితవ్యం...అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి

RRR పోస్టర్

రాజమౌళి RRR సినిమా గురించి ఇప్పటికి ఏ మాత్రం బయటకు రానియ్యడం లేదు.  ఇప్పటికి రెండు షేడ్యూల్స్ పూర్తయ్యాయి..అయితే.. ఆ సినిమా టైటిల్ కాని..పాత్రల తీరు కాని..లేదా కథాంశం కాని..ఏదీ కూడా  మిస్టరీగానే ఉంది. అయితే వీటినన్నిటికి ఫుల్‌స్టాప్ పెట్టాలనీ రాజమౌళి చూస్తున్నారు..అందుకు ఆయన ఓ డేటును కూడా ఎంచుకున్నారు.

  • Share this:
    రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు రానియ్యడం లేదు.  ఇప్పటికి రెండు షేడ్యూల్స్ పూర్తయ్యాయి..అయితే.. ఆ సినిమా టైటిల్ కాని..పాత్రల తీరు కాని..లేదా కథాంశం కాని..ఏదీ కూడా ఇప్పటికి  మిస్టరీగానే ఉంది. ఈ  సినిమా మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో  హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి.   RRRలో ఎన్టీఆర్‌ పాత్ర రాబిన్‌హుడ్‌ తరహాలో నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని కొందరు, రామ్‌చరణ్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని.. బ్రిటిష్‌ కాలం నాటి కథ అని, ప్రభాస్‌ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని ఇంకొందరు రాశారు. ఇక ఇందులో బాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్స్‌ నటిస్తున్నారని ఇలా రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దీనికంతటికి ఓ పుల్‌స్టాప్ పెట్టాలనీ రాజమౌళి అనుకుంటున్నాడు. అందులో భాగంగా..ఆయన ఈ సినిమా పూర్తి విశేషాలు..హీరోయిన్స్ నుండి...సినిమా పేరు వరకు వెల్లడించనున్నారు. దానికి కూాడా..ఓ మూహుర్తం ఫిక్స్ చేశాడు రాజమౌళి.

    Rajamouli Will Arrange Special Press meet for RRR movie before the Calcutta Schedule pk.. రాజ‌మౌళి సినిమా షూటింగ్ జ‌రుగుతుంది కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. ఇప్ప‌టికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. కానీ ఇందులో హీరోయిన్లు ఎవ‌రు.. ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. rrr movie,rrr movie shooting,rrr movie calcutta schedule,rajamouli rrr movie new schedule,ram charan ntr rrr movie,rajamouli rrr movie,rrr movie press meet,telugu cinema,రాజమౌళి,రాజమౌళి RRR షూటింగ్,రాజమౌళి ప్రెస్ మీట్,RRR రాజమౌళి ప్రెస్ మీట్,మార్చ్ 14న RRR ప్రెస్ మీట్,రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR షూటింగ్
    ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి


    బాహుబలి తర్వాత.. రాజమౌళి సినిమా అంటే కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు.. యావత్‌ భారతదేశం ఆయన సినిమా కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తుంటుంది. ‘బాహుబలి’ ఒకటి, రెండు చిత్రాలతో తన సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించాడు రాజమౌళి. టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  మా హీరో పాత్ర గొప్పదంటే.. మా హీరో పాత్ర గొప్పదని కామెంట్లు పెడుతున్నారు హీరోల అభిమానులు. వీటన్నింటికీ మార్చి 14న రాజమౌళి సమాధానం చెబుతారని సమాచారం. ఆరోజు మీడియాతో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    అదిరిపోయిన పూజ హెగ్డే లేటెస్ట్‌ హాట్ ఫోటోస్
    First published: