అదిరిపోయిన పూరి ‘రొమాంటిక్‌’ హీరోయిన్‌

ఆకాష్ పూరి ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయి.. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆయన తాజా సినిమా రోమాంటిక్ సినిమా గురించి నిర్మాత చార్మి తాజా సమాచారాన్ని తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.

news18-telugu
Updated: March 13, 2019, 6:12 AM IST
అదిరిపోయిన పూరి ‘రొమాంటిక్‌’ హీరోయిన్‌
నటుడు ఆకాష్ పూరి, హిరోయిన్ కేతిక శర్మ
  • Share this:

ఆకాష్ పూరి ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయి.. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో ఓ జంట ప్రేమలోపడే కథాంశం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. నేహా శెట్టి హిరోయిన్‌గా చేశారు.  ఈ సినిమాలో ఆకాశ్‌ నటనకు మంచి స్పందన లభించింది.  ఈ చిత్రం మంచి టాక్‌ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.  ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాలేదు. దీంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరి. అందులో భాగంగా.. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ.. ‘రొమాంటిక్‌’ సినిమాను రూపొందిస్తున్నాడు.


రొమాంటిక్‌’ సినిమాలో హీరోయిన్‌ ఖరారయ్యారు. ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు పూరి. కేతిక శర్మ అనే మోడల్‌ ఆకాష్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్‌లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు.  ఇది కేతికా శర్మాకు తొలి సినిమా కావడం విశేషం.
దిశాపటానీ సెన్సేషనల్ హాట్ ఫోటో షూట్
Loading...
First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...