హిందీ సూపర్ స్టార్.. సల్మాన్ ఖాన్ 'దబంగ్' సినిమా కలెక్షన్స్ పరంగానే కాకుండా.. అప్పటి వరకు వచ్చిన పోలీస్ పాత్రలకు భిన్నంగా..సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల్నీ మైమరిపించారు. దబాంగ్‌లో మాస్ పోలీస్ ఆఫీసర్‌గా సల్మాన్ అదరగొట్టారు. దీంతో అప్పటివరకు ఉన్న కలెక్షన్ల రికార్డ్స్‌ను సల్మాన్ ఈ చిత్రంతో తిరగరాశారు. ఈ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. అది అలా ఉంటే..ఈ సినిమాలో కథ నచ్చి తెలుగులో పవర్ స్టార్ గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేశాడు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ..కొన్ని మార్పులు చేసి..తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అదే ఊపుతో హిందీలో అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో దబాంగ్ 2 కూడా తీశారు. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. అయితే దబాంగ్ 2, తెలుగు రీమేక్ సర్ధార్ గబ్బర్ సింగ్ మాత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
హిందిలో దబాంగ్ సిరీస్‌కు మాత్రం మంచి పేరు, వసూళ్లు దక్కాయి. దీంతో ఇప్పుడు దబాంగ్ 3 వస్తోంది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా సల్మాన్ ఖాన్, హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి.షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మధ్యనే ఓ పాటను కూడా చిత్రీకరించారు. సల్మాన్, ప్రభుదేవాలు ఇంతకు ముందు..తెలుగు సూపర్ హిట్ చిత్రం పోకిరిని హిందీలో వాంటెడ్‌గా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో వీరి కలయికలో వస్తోన్న దబాంగ్ 3 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు దబాంగ్ ఉన్న బ్లాక్ బస్టర్ హిట్ చరిత్ర వల్ల..ఈ సినిమాలో చిన్న ఛాన్స్ దొరకడం కూడా అదృష్టంగానే భావిస్తుంటారు నటీ నటులు. అలాంటిది 'దబాంగ్ 3'లో నటించే అవకాశాన్ని మన తెలుగు కమెడియన్ దక్కించుకున్నారు. అలీ ఈ సినిమాలో కానీస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అలీ ఈ మద్యే వైసీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతీ తెలిసిందే.
.@BeingSalmanKhan with Telugu veteran comedian #AliBasha on the sets of Dabangg 3 pic.twitter.com/kqlgVQWKJL
— B4U (@THEOFFICIALB4U) April 21, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Arbaaz khan, Bollywood news, Hindi Cinema, Prabhu deva, Salman khan, Sonakshi Sinha