Sameera Reddy: హమ్మయ్యా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ భామ సమీరా రెడ్డి..

Sameera Reddy | గత కొన్ని రోజులుగా సమీరా రెడ్డి.. తాను గర్భవతిగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. నిన్నటి నిన్న కూడా మేకప్ లేకండా ఒక వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ రోజు ఉదయం తనకు ఆడ పిల్ల పుట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు చేతుల్లో..తన చేతులు పెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: July 12, 2019, 5:31 PM IST
Sameera Reddy: హమ్మయ్యా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ భామ సమీరా రెడ్డి..
సమీరా రెడ్డి ఫైల్ ఫోటోస్
news18-telugu
Updated: July 12, 2019, 5:31 PM IST
హమ్మయ్యా.. ఏమైతేనేం ఎట్టకేలకు సమీరా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత కొన్ని రోజులుగా సమీరా రెడ్డి.. తాను గర్భవతిగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. నిన్నటి నిన్న కూడా మేకప్ లేకండా ఒక వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ రోజు ఉదయం తనకు ఆడ పిల్ల పుట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు చేతుల్లో..తన చేతులు పెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. మొత్తానికి ఇన్ని రోజులు గర్భవతిగా రకరకాల భంగిమలతో నానా ఫోజులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రచ్చకు నేటితో పులిస్టాప్ పడ్డట్టు అయింది. సమీరా రెడ్డికి అంతకుముందు ఒక మగ పిల్లాడు ఉన్నాడు.



 






View this post on Instagram




 

Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed


A post shared by Sameera Reddy (@reddysameera) on





సమీరా రెడ్డి విషయానికొస్తే.. పదేళ్ల కింద ఈ భామ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అశోక్’‌తో పాటు ’నరసింహుడు’ సినిమాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు పుకార్లు షికార్లు చేసాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఏకంగా సమీరా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’ సినిమాలో కథానాయికగా నటించింది కూడా. ఆ తర్వాత ఈ భామను అందరు మరిచిపోయారు. తెలుగులో ఊహించిన విజ‌యం రాక‌పోవ‌డంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్క‌డ కూడా కొన్నేళ్ల పాటు వ‌ర‌స అవ‌కాశాలు అందుకుంది. అయితే ఎక్క‌డా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేక‌పోయింది స‌మీరా రెడ్డి. సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది స‌మీరా. ఈ జంటకు ఆ మ‌ధ్య ఓ బాబు కూడా పుట్టాడు. తాజాగా సమీరా రెడ్డి.. రెండో బిడ్డకు జన్మించింది.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...