కాజల్ మీకు ఎంత ధైర్యం..చందమామ చేసిన ఆ పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్

కాజల్ అగర్వాల్..'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఓ దశాబ్దం కాలం నుండి తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తోంది. ఇటీవల కాజల్ తన సోషల్ మీడియాలో మేకప్ లేని తన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎలా ఉన్న మనల్ని మనం గౌరవవించుకోవాలి అని...చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: June 1, 2019, 12:10 PM IST
కాజల్ మీకు ఎంత ధైర్యం..చందమామ చేసిన ఆ పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్
కాజల్ అగర్వాల్ Photo: Instagram
news18-telugu
Updated: June 1, 2019, 12:10 PM IST
కాజల్ అగర్వాల్..'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఓ దశాబ్దం కాలం నుండి తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తోంది. అందులో భాగంగా పది సంవత్సరాలుగా తన ముఖానికి రంగులు అద్దుతూ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. అయితే సాదారణంగా కాజల్ మాత్రమే కాదు, సినిమా హీరోయిన్స్ ఏవరు ముఖానికి రంగులేకుండా బయటకు రారు..అలా తమ ముఖాన్ని ప్రేక్షకులకు చూపించడానికి ఇష్టపడరు. అలాంటిది అందం, అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్‌ మాత్రం సహజంగా, ఎలాంటీ మేకప్ లేకుండా దిగిన ఫొటోల్ని తన సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఇప్పుడు అవి కాస్తా.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూస్తున్న నెటిజెన్స్.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కాజల్ మీరు సూపర్..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి తోడు కాజల్, ఆ ఫోటోల కింద.. 'అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని' ఓ క్యాప్షన్‌గా కూడా రాస్తూ.. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలని పేర్కోంది.



 




Loading...

View this post on Instagram




 

People can’t discover themselves anymore. Perhaps because we live in a world crazed by physical attraction or because social media has swallowed up our self esteem in whom and what it glorifies. Billions of rupees are spent on cosmetics and beauty products that promise you the prefect body. Narcissism seems to exist everywhere. Between those lines, we try to join the crowd or feel left out. Yet the only way we can truly be happy is when we start accepting who we are rather than defining or carving a different image for ourselves. Although makeup beautifies our outer persona, does it build our character and define who we are? True beauty lies, in accepting ourselves for how lovely we are.


A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on





ఆమె ఇంకా తన పోస్ట్‌లో రాస్తూ.. మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్నలోకంలో  బతుకుతున్నామని అందులో భాగంగా అందం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ సౌందర్య ఉత్పత్తులే మనల్ని అందంగా చూపిస్తున్నాయని అన్నారు. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడం మొదలు పెట్టినప్పుడు నిజంగా ఆనందంగా ఉంటామని రాశారు.  ఆమె ఇంకా రాస్తూ ‘ఈ వేసుకున్న మేకప్‌ మనల్ని బయట అందంగా కనపడేలా చేస్తోంది కాని ఇదీ మన నిజ వ్యక్తిత్వాన్ని మార్చదు కదా... అయితే మనల్ని మనం స్వీకరిస్తూ, గౌవరవించుకున్నప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది’ అని కాజల్‌ తన పోస్ట్‌‌లో రాసుకున్నారు.



అదీ అలా ఉంటే సడెన్‌గా కాజల్ ఇలా ఫిలాసఫీ మాట్లాడుతుండడం..తన ప్రేక్షకుల్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతలా ఓ పేద్ద పోస్ట్ రాయడమేంటీ...దానికి తోడు ఎంతో ధైర్యంగా మేకప్ లేకుండా తన ఫోటోలను పోస్ట్ చేయడం..ఏంటనీ..ఇంతలా ఆమెను ప్రభావితం చేసిన ఘటన ఏమైఉంటుందని ఆరా తీస్తున్నారు ఆమె అభిమానులు.
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...