స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా చిత్రంలో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అందుకున్నాయి. రిలీజైన రెండు సాంగ్స్ కూడా ఒక ఊపు ఊపేస్తున్నాయి. ముందుగా రిలీజ్ చేసిన సామజవరగమణ సాంగ్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా అదే సాంగ్ ను ప్రముఖ పాప్ సింగర్ మనీషా ఈరబత్తిని అదే సాంగ్ సింగిల్ యూట్యూబ్ లో విడుదల చేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు ప్రమోషన్ కోసం ఇలా సింగర్స్ ముందుకు వచ్చి పాడటం చాలా సంతోషంగా ఉందంటే ఫ్యాన్స్ తమ కామెంట్స్ ద్వారా మనీషాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మనీషా ఈరబత్తిని తెలుగులో పాప్ సింగర్ గా బాగా పేరు సంపాదించింది. ఎన్ఆర్ఐగా టాలివుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ పాడుతాతీయగా ప్రోగ్రామ్ ద్వారా ఫేమ్ సంపాదించుకుంది. సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా సైతం ఈ భామ పేరు సంపాదించుకుంది. అలాగే స్టేజ్ షోస్ ద్వారా కూడా మనీషా ఈరబత్తిని బాగా ఫేమస్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikuntapuramlo, Ala Vaikuntapuramloo, Ala Vaikunthapuramulo, Ala Vaikunthapurramloo, Allu Arjun, Tollywood