పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..

పూనమ్ కౌర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తను చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది. తాాజాగా ఈ భామ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: December 10, 2019, 11:26 AM IST
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..
పూనమ్ కౌర్ ఫైల్ ఫోటో
  • Share this:
పూనమ్ కౌర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తను చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది. ఎందుకంటే అప్పట్లో పవన్‌తో ఈమెకు ఎఫైర్ ఉందంటూ వార్తలు బాగానే వచ్చాయి. దానిపై ఆమె కూడా ఎప్పుడూ కాదని స్పందించలేదు.. అవునని ఒప్పుకోలేదు. అప్పట్నుంచి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉంది. రీసెంట్‌గా ఈ భామ షాద్ నగర్‌లో దిశా ఘటనపై స్పందించిన సంగతి తెలిసిందే కదా. ఎపుడు ఉమెన్ సెంట్రిక్ పోస్ట్‌లతో వార్తల్లో నిలిచే ఈమె తాజాగా ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవని కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.  రీసెంట్‌గా ఆమెకు హోటల్‌లో ట్వీట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఆశాదేవితో కలిసి ఉన్న ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతుంది. ఆమెను అత్యంత క్రూరంగా చంపిన మానవ మృగాలకు ప్రభుత్వం చట్ట ప్రకారం ఉరి తీయబోతున్నారంది. ఆ రోజున భారత దేశం ఎంతో సంతోషంగా ఉంటుంది అని వ్యాఖ్యానించింది.First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>