Home /News /movies /

POONAM KAUR SAYS A DIRECTOR BRAINWASHED HER TO SPEAK AGAINST A PERSONALITY SHE TWEETS SR

ఆయన మీదకు ఉసిగొల్పింది ఈ దర్శకుడే.. : పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

పూనమ్ కౌర్ Photo : Twitter

పూనమ్ కౌర్ Photo : Twitter

Poonam Kaur: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ తాజాగా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాపై స్పందించింది.

    Poonam Kaur: 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటించింది. ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే, ఆమె తన సినిమాల కంటే పలు వివాదాలతో పాపులర్ అయ్యింది. పూనం కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా రకరకాల అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తుంది. అయితే ఆమె ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు, విమర్శలు చేస్తూ ఉంటుంది. అది అలా ఉంటే తాజాగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అంటూ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించి వరుసగా కొన్ని ట్వీట్స్ చేశాడు వర్మ. పవర్ స్టార్ తదుపరి చిత్ర టైటిల్ అని అందులో నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఓ రష్యన్ మహిళా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు టిక్ టాక్ ఫేమ్ పవన్ కళ్యాణ్ తన హీరో అని ప్రకటించాడు.




    అయితే ఈ సినిమా ప్రకటనపై పూనమ్ స్పందించింది. దీనికి సంబందించి కొన్ని ట్వీట్స్ చేసిన ఈ భామ.. ఈ సినిమాలో ఆర్జీవీ కూడా జత చేయండని కోరింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని, వారిని రెచ్చగొట్టడం, మళ్లీ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే వాడి పాత్రను కూడా పెట్టండని తెలిపింది. వర్మను తాను నిన్న చిన్నతనంలో ఎంతో గౌరవించానని, కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక మరో ట్వీట్‌లో ఆమె రాస్తూ.. ఓ డైరెక్టర్ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తన బ్రెయిన్‌ వాష్ చేశాడని తెలిపింది.
    First published:

    Tags: Poonam kaur, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు