పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సినిమాల పరంగా రాణి క్రేజ్ వివాదాలతో తెచ్చుకుంది పూనమ్. ఏదో ఒక కాంటవర్సీతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు, చేసే కామెంట్సే ఇందుకు ప్రధాన కారణం. 16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ అవుదామని ఇండీస్ట్రీకి వచ్చిన ఈ భామ.. ఆశించిన మేర అవకాశాలు అందుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మోసపోయానంటూ వివాదాలతో సావాసం చేస్తున్న ఈ బ్యూటీ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయమై పెడుతున్న పోస్టులు పలు చర్చలకు తావిస్తుంటాయి. కాగా, తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది పూనమ్.
కత్తి మహేష్ ఎప్పుడైతే పూనమ్ పేరు బయటకు తీశాడో అప్పటినుంచి ఆమెకు సంబంధించిన ప్రతి ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ వ్యవహారం ఇప్పటికీ ఓ మిస్టరీగా లానే మిగిలింది. అయితే తనకు కొందరి వల్ల అన్యాయం జరిగిందని పరోక్షంగా చెబుతూ వస్తున్న పూనమ్.. అసలు విషయాన్ని మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన్ను పొగుడుతుందా, తిడుతుందా అర్థం కాకుండా తికమక పెడుతుంటుంది.
అయితే ఆమె పెడుతున్న పోస్టుల్లో #PKLove అనే హ్యాష్ ట్యాగ్ గమనిస్తూ వస్తున్న నెటిజన్లు దీనిపై ఆరా దీయడం షురూ చేశారు. అసలు దీని అర్థం ఏంటనేది తెలుసుకోవడానికి ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమెనే నేరుగా అడిగినా కరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా స్కిప్ చేస్తూ వచ్చింది. తాజాగా మరోసారి కూడా పూనమ్‌కి ఓ నెటిజన్ నుంచి అదే ప్రశ్న ఎదురు కావడంతో ఈ సారి రిటర్న్ కౌంటర్ వేసింది.
PkLove అంటే.. అది పూనమ్ కౌరా? లేక పవన్ కళ్యాణా? అని ఓ నెటిజన్ అడిగేశాడు. దీనికి పూనమ్ కౌర్ తన స్టైల్లో కౌంటర్ వేస్తూ సమాధానమిచ్చింది. ఏ కారణం లేకపోయినా మీరు నన్ను టీజ్ చేస్తుంటారు కదా? అయినా కూడా నేను ఇలానే చేస్తుంటాను అని అర్థం.. అర్థమైందా తమ్ముడూ నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదమ్మా అంటూ రియాక్ట్ అయింది పూనమ్ కౌర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Poonam kaur, Tollywood actress