టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ మరోసారి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిచకుండా విమర్శలు గుప్పించారు. నిన్న వైజాగ్‌లో పవన్ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ప్రసంగం కాస్త సీరయిస్గానే సాగింది. అయితే.. ఈ నేపథ్యంలో పూనం కౌర్ తాజాగా మరో ట్వీట్ చేసింది. 'ఆగ్రహం అంటే పవర్ కాదు' అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో 'పవర్' స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. మరికొందరు పూనంకు మద్దతు తెలిపారు. వైసీపీకి ఎప్పుడు అమ్ముడుబోయావు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'నీకు బుద్ధి ఉంటే ఎవరి గురించి ట్వీట్ చేస్తున్నావో వారి పేర్లను కూడా రాయి' అంటూ ఇంకొందరు పూనం ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. గత కొన్నిరోజుల క్రితం కూడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా పూనం ట్వీట్ చేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.