హోమ్ /వార్తలు /movies /

MAA Elections | Poonam Kaur : ప్రకాష్ రాజ్‌ గెలిస్తే.. అసలు విషయం బయట పెడుతా.. పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు వైరల్..

MAA Elections | Poonam Kaur : ప్రకాష్ రాజ్‌ గెలిస్తే.. అసలు విషయం బయట పెడుతా.. పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు వైరల్..

Poonam Kaur Photo : Twitter

Poonam Kaur Photo : Twitter

MAA Elections: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇంకా చదవండి ...

Poonam Kaur : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్‌ కౌర్‌ తెలిపింది. అప్పుడే తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలుగుతానని పేర్కోంది. అంతేకాదు ప్రకాష్ రాజ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోని పంచుకుంది. ప్రకాష్ రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయి. నటి పూనమ్ కౌర్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. పూనమ్ కౌర్..ఎస్‌వీ క‌ృష్ణా రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది. అంతేకాకుండా పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు. అయితే ఆమె తన సినిమాల కంటే..ఆమె చుట్టూ అల్లుకున్న వివాదాల ద్వారా పాపులర్ అయ్యింది. పూనమ్ ‘శౌర్యం’, ‘గణేష్‌’, ‘గగనం’, ‘శ్రీనివాస కల్యాణం’ వంటి పలు చిత్రాల్లో నటించింది.

ఇక మా ఎలక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి.

ఇక ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యనే పోటీ ఉండనుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేసి ప్రచారం చేస్తుండగా.. తాజాగా మంచు విష్ణు ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

మా ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.

ఈ ఎన్నికల్లో (Prakash raj) (Manchu Vishnu) ప్రకాష్ రాజ్, మంచు విష్ణు,  సివిఎల్‌ నరసింహారావు మా ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. అయితే సివిఎల్ నరసింహారావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

First published:

Tags: MAA Elections, Poonam kaur, Tollywood news

ఉత్తమ కథలు