Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తొలిసారి మాయాజాలం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ అంత సక్సెస్ అందుకోలేదు. కొన్ని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా ఎంతోకొంత గుర్తింపు అందుకుంది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఆమె ట్వీట్ లను చూస్తే అర్థమవుతుంది.
ఒక్కోసారి సోషల్ మీడియాలో ఈమె చేసే ట్వీట్ లు తరచు వివాదాలకు దారి తీస్తాయి.కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉండగా.. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా బాగా రియాక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో అడుగుపెట్టింది అంటే చాలు మొత్తానికి ఏదో ఒక కౌంటర్ తో దింపేస్తుంది. ఇక రాజకీయ విషయాలలో కూడా బాగా కౌంటర్లు వేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయంలో వార్నింగ్ ఇస్తుంది పూనమ్.
ప్రస్తుతం బుల్లితెర లో కొన్ని చానళ్లు తనకోసం తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు పదే పదే కాల్స్ చేస్తున్నారట. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ కామెంట్ చేసింది పూనమ్. తనకు ఎలాంటి టీవీ షోలో కనిపించాలనే ఇంట్రెస్ట్ లేదని.. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా తనకు స్వర్ణఖడ్గం కూడా ఆర్కా మీడియా అడిగారనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నానని తెలిపింది.
ఇక తను ఏ చానల్స్ గురించి అలా కామెంట్ చేసిందో తెలియదు కానీ.. గతంలో తను బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో బిగ్ బాస్ టీమ్ ను కలిసిందని, కానీ వాళ్లు ఆమెని తీసుకునేందుకు సుముఖంగా లేరని వార్తలు వినిపించగా.. ఈ విషయం గురించి బిగ్ బాస్ టీమే తనను కలిశారని, షో కి రమ్మని కోరగా తను రిజెక్ట్ చేశానని తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయం గురించి తప్పుడు వార్తలు వచ్చినప్పుడు కూడా పూనమ్ గట్టిగా రియాక్ట్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arka Media, Bigg Boss 5 Telugu, Poonam kaur, Star Maa, Tv shows management, ఆర్కా మీడియా, పూనమ్ కౌర్, బిగ్ బాస్