Poonam Kaur: టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ పరిచయం అందరికీ తెలిసిందే. ఇక ఈమె మాయాజాలం సినిమాతో తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఇక ఈమె అంతగా సక్సెస్ ను అందుకోలేకపోగా.. సోషల్ మీడియాలో మాత్రం బాగా క్రేజీ పేరు అందుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఆమె చేసే ట్వీట్లు తరుచు వివాదాల్లోకి తీసుకొస్తుంది. ఇక ఈమె చేసిన సెటైర్లు కించపరిచేలా ఉన్నట్లు అనిపిస్తాయి. సోషల్ మీడియాలో అడుగుపెట్టింది అంటే చాలు ఎటువంటి దడ పుట్టిస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఇక హీరో పవన్ కళ్యాణ్ పై బాగా కౌంటర్లు వేస్తున్నట్లు అనిపించినట్టే అనిపిస్తుంది కానీ ఆయనపై మద్దతు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక తరచు వివాదాల్లో ముందుంటుందని చెప్పవచ్చు.
ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటో షేర్ చేయగా.. ఆ ఫోటోను చూసిన నెటి జనులు రకరకాలుగా కౌంటర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలు ఆమె ఫామ్ హౌస్ లో ఉన్నట్లు కనిపించగా.. ఓ నెటిజన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఫామ్ హౌస్ లా కనిపిస్తుందే.. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ కానుందా.. అని కామెంట్ చేయగా.. వెంటనే ఆ కామెంట్ కు స్పందించిన పూనమ్ నెటిజన్ పై మండిపడింది. నీ ఆలోచనా విధానమే నువ్వు ఎంత చీప్, ఎంత మంచి వాడివి అని చెబుతోంది. ఇలాంటి రాయమని నిన్ను ఎవరు ఉసిగొల్పారో వారిని ఆధారంగా చేసుకొని నీ బుద్ధి ఏంటో చెప్పవచ్చు నీ ఆలోచనలు నీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి ఇంకా ఆలోచిస్తూనే ఉండు అని మండిపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farm house, Netizen, Pawan kalyan, Poonam kaur, Poonam kaur audio tape