Home /News /movies /

POONAM KAUR EMOTIONAL MESSAGE AND SHE WANT TO KILL THOSE RAPISTS GO TO JAIL PK

వదలండి సర్ వాళ్లను చంపేసి జైలుకెళ్తా.. పూనమ్ కౌర్ ఆవేశం..

పూనమ్ కౌర్ (Source: Twitter)

పూనమ్ కౌర్ (Source: Twitter)

పూనమ్ కౌర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొందరు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. పూనమ్ కూడా అలాంటి జాబితాలోకి వస్తుంది. పవన్ కల్యాణ్ పేరుతోనే..

పూనమ్ కౌర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొందరు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. పూనమ్ కూడా అలాంటి జాబితాలోకి వస్తుంది. పవన్ కల్యాణ్ పేరుతోనే ఈమెకు ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టింది. తాజాగా జరిగిన షాద్‌నగర్ ఘటనపై పూనమ్ చాలా ఎమోషనల్ అయింది. ఓ స్త్రీకి నడిరోడ్డు మీద సాయం అవసరమైనప్పుడు.. నాలుగు జంతువులు ఆమెను చుట్టుముట్టాయి.. అక్కడ్నుంచి ఆమెను ఎత్తుకొని.. అతికిరాతకంగా అత్యాచారం చేసాయి.. కోరిక తీరిన తర్వాత సజీవ దహనం చేసాయి.. అలాంటి వాళ్లను మన సమాజంలో ఇంకా ఉంచుతున్నాం.



పాపం ఎన్నో గంటల పాటు ఆ కుటుంబానికి అమ్మాయి జాడ తెలియదు.. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటూ సీరియస్‌గా ప్రశ్నించింది పూనమ్. ఈ జంతువులను చంపి తాను జైలుకు వెళ్లాలనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. వాటిని నేనే చంపి జైలు శిక్ష అనుభవించాలనుకుంటున్నాను.. దేశంలో జరుగుతున్న ఈ రేప్ టెర్రర్‌కు పరిష్కారం ఏమిటి అంటూ ఆమె అందర్నీ అడుగుతుంది. దయచేసి ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయొద్దని.. దీన్ని మతానికి అంటగట్టకుండా ఓ వ్యక్తితో మాత్రమే ముడిపెట్టమని కోరుకుంటుంది పూనమ్. మొత్తానికి ఈ భామ చేసిన ఎమోషనల్ మెసేజ్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Poonam kaur, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు