కమల్ హాసన్‌తో ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చిన పూజా కుమార్..

Kamal Haasan Pooja Kumar: కమల్ హాసన్‌కు మంచి నటుడిగానే కాకుండా ఎఫైర్స్ కింగ్ అని కూడా పేరుంది. అసలు సహజీవనం అంటే తెలియక ముందే అందరికీ దీని గురించి పరిచయం చేసాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 26, 2020, 11:12 AM IST
కమల్ హాసన్‌తో ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చిన పూజా కుమార్..
కమల్, పూజా Photo : Twitter
  • Share this:
కమల్ హాసన్‌కు మంచి నటుడిగానే కాకుండా ఎఫైర్స్ కింగ్ అని కూడా పేరుంది. అసలు సహజీవనం అంటే తెలియక ముందే అందరికీ దీని గురించి పరిచయం చేసాడు ఈయన. సారికతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. ఆ తర్వాత గౌతమితో కూడా చాలా కాలం పాటు కలిసే ఉన్నాడు కమల్. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక 60 ఏళ్ళ తర్వాత కూడా కమల్ ఇంకా అదే రొమాంటిక్ ఇమేజ్ కంటిన్యూ చేస్తున్నాడంటే అతిశయోక్తి కాదేమో..? కొన్నేళ్లుగా ఈయన ఎన్నారై బ్యూటీ పూజా కుమార్‌తో సహ జీవనం చేస్తున్నాడనే వార్తలొచ్చాయి.

కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)
కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)


పైగా గతంలో కమల్ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతో పాటు పూజా కుమార్ కూడా ఉంది. అందులో కేవలం వాళ్ల కుటుంబమే ఉంటే మధ్యలో పూజా కూడా ఉండటంతో కమల్‌తో ఈమె ప్రస్తుతం ఎఫైర్ నడిపిస్తుందని వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఈ వార్తలపై ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే. తాను గత ఐదారేళ్లుగా కమల్‌తో కలిసి పని చేస్తున్నానని.. వరస సినిమాలు ఆయనతోనే చేస్తున్నానని.. ఆయన ఓ గొప్ప క్రియేటర్ అండ్ ఓ మెస్మరైజర్ అని చెప్పుకొచ్చింది.

కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)
కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)


ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడని.. తనకు జీవితంలో ఓపిక గురించి కూడా నేర్పించింది ఆయనే అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు.. అన్నాదమ్ములు.. కూతుళ్లు కూడా బాగా పరిచయమని చెబుతుంది పూజా. కానీ ప్రస్తుతం బయట వినిపిస్తున్న రూమర్స్ మాత్రం తాను కమల్ భార్య స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు అనుకుంటున్నారని.. అందులో ఎలాంటి నిజం లేదని చెబుతుంది పూజా.

కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)
కమల్ హాసన్ పూజా కుమార్ (kamal haasan pooja kumar)


తనకు కమల్ కుటుంబంతో పాటు అందరూ పరిచయం కాబట్టి అలా అనిపిస్తుందేమో అని చెప్పుకొచ్చింది పూజా. తనకు కమల్‌తో ఎలాంటి ఎఫైర్ లేదని కుండ బద్దలు కొట్టేసింది పూజా కుమార్. ఆయన నుంచి మంచిని నేర్చుకుంటున్నానని.. దయచేసి తమ ఇద్దరి మధ్య అలాంటి లేనిపోని పుకార్లు పుట్టించొద్దని వేడుకుంటుంది పూజా కుమార్. విశ్వరూపం 1,2తో పాటు ఉత్తమ విలన్ సినిమాల్లో కలిసి నటించారు పూజా, కమల్.
Published by: Praveen Kumar Vadla
First published: May 25, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading