పవన్ కళ్యాణ్..‘పింక్’ రీమేక్‌లో పూజా హెగ్డే..

పవన్ కళ్యాణ్,పూజా హెగ్డే (Twitter/Photos)

ప్రస్తుతం పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పింక్ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    ప్రస్తుతం పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. దాంతో పాటు వరుణ్ తేజ్‌తో నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో శ్రీదేవిగా అదరగొట్టింది. ప్రెజెంట్ ఈ భామ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘జాన్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘పింక్’ రీమేక్‌లో పూజా హెగ్డే ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హిందీలో తాప్సీ చేసిన పాత్రలో తెలుగులో పూజా హెగ్డే చేయనున్నట్టు సమాచారం. అంటే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా కాకుండా.. ఒక నటిగా యాక్ట్ చేయబోతుంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో అజిత్ సరసన విద్యాబాలన్ నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఈ సినిమాలో నయనతారను అనుకుంటున్నారు. ఇక పూజా హెగ్డే విషయానికొస్తే.. ఇప్పటి  వరకు గ్లామర్ పాత్రలే చేసిన ఈ మంగళూరు బ్యూటీకి ‘పింక్’ రీమేక్‌లో ఈ క్యారెక్టర్ నటిగా మంచి బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటికే దిల్ రాజు.. పూజా ను కలిసి ఈ పాత్ర చేయమని అడినట్టు సమాచారం.ఈ పాత్ర చేయడానికి పూజా హెగ్గే ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.త్రివిక్రమ్ మాటలు రాయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: