హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde : ప్రభాస్ కోసం ఫస్ట్ టైమ్ ఆ పాత్రలో కనిపించనున్న పూజా హెగ్డే..

Pooja Hegde : ప్రభాస్ కోసం ఫస్ట్ టైమ్ ఆ పాత్రలో కనిపించనున్న పూజా హెగ్డే..

పూజా హెగ్డే Photo : Instagram

పూజా హెగ్డే Photo : Instagram

Prabhas : 'సాహో, లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రాధేశ్యామ్'.

'సాహో, లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రాధేశ్యామ్'. పిరియాడిక్ లవ్ స్టోరి జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. లేట్‌గా వచ్చిన సరే.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించింది. ఇక మొదటి నుండి ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏమైఉంటుందని.. చాలా ఆసక్తిగా ఉన్నారు పూజా హెగ్డే అభిమానులు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాల రూమర్స్ వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఆమె ఫస్ట్ లుక్ విడుదల వరకు వేయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా మరో రేంజ్‌లో ఉండే విధంగా ప్లాన్ చేశాడట దర్శకుడు రాధా కృష్ణ.


పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదల కానున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకు ఆస్కారం ఉంది.

First published:

Tags: Pooja Hegde, Prabhas20, Tollywood news

ఉత్తమ కథలు