పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది. తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ భామ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ వాటిని తనదైన శైలిలో చిత్రకరించాడట. కాగా తాజా సమాచారం మేరకు అందాలతార పూజ హెగ్డే ఈ సినిమాలో స్టాండప్ కమేడియన్ గా నటిస్తోంది. దీని కోసం ఆమె కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకుందని టాక్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశలో వుంది. పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. రాధేశ్యామ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవల రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్’గా ఫైనల్ అయ్యిందని టాక్. ఈ సినిమాలే కాకుండా తెలుగులో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది పూజా. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. ఓ తమిళ సినిమాలో కూడా పూజా ఫైనల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde