ప్రభాస్ పిరియాడిక్ ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ ఆ పాత్ర చేస్తున్న పూజా హెగ్డే..

పూజా హెగ్డే.. ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.

news18-telugu
Updated: May 22, 2020, 6:54 AM IST
ప్రభాస్ పిరియాడిక్ ఫిల్మ్‌లో ఫస్ట్ టైమ్ ఆ పాత్ర చేస్తున్న పూజా హెగ్డే..
పూజా హెగ్డే Instagram
  • Share this:
పూజా హెగ్డే..  నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. తెలుగులో పూజ హెగ్డే వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె ప్రస్తుతం అఖిల్‌కు జోడీగా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా చేస్తోంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. పూజా ప్రభాస్ సరసన చేస్తున్న సినిమా జాన్. ఈ సినిమా ముగింపు దశలో వుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన ఓల్డ్ లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ అంతేకాదు ఈ సినిమాలో పూజా చాలా కొత్తగా కనబడుతూ.. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.
Published by: Suresh Rachamalla
First published: May 22, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading