కొన్ని విషయాలను మొదలుపెట్టేటప్పుడు ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందో... ముగించేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందో మీకు పరిచయం ఉందా? లేకుంటే ఈ ఆర్టికల్‌లో ఉన్న ఫొటోలో పూజా హెగ్డేని ఒకసారి చూసేయండి. యస్. అచ్చం ఇలాగే ఉంటుంది. ఇంతకీ పూజా హెగ్డే ఆనందానికి రీజన్ వాట్? అని క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయా? ఇంకేముంటుంది? ఇయర్ ఎండ్‌ని సెలబ్రేట్ చేసుకోవచ్చనే ఆనందమే!. ఇయర్ ఎండింగ్లో పడింది. అందుకే సినిమాల తాజా షెడ్యూళ్లకు ఒక్కొక్కరుగా ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే టీమ్ కూడా అదే పనిలో ఉంది. పూజా హెగ్డే టీమ్ అంటే... రాధేశ్యామ్ టీమ్ అన్నమాట.
రీసెంట్గా ఇటలీలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన రాధేశ్యామ్ టీమ్, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఫాస్ట్ పేస్‌లో షూటింగ్ జరుపుకుంది. మంగళవారం ఈ సినిమా షూటింగ్ ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సో 2020లో డిసెంబర్ 30, 31కి పూజా హెగ్డేకి ఎలాంటి షూటింగులూ లేవన్నమాట. సో ఆ లెక్కన పూజా ఈ ఇయర్లో షూటింగ్ చేసిన చివరి హీరో ప్రభాస్. అలాగే 2021లో ఆమె షూటింగ్ స్టార్ట్ చేయబోయే ఫస్ట్ హీరో కూడా ప్రభాసే. వావ్.. వాటే కొలాబరేషన్ అనుకుంటున్నారా? యస్... ప్రభాస్ అండ్ పూజా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మీద ఇప్పటికే ఫుల్ పాజిటివ్ బజ్ నడుస్తోంది. దానికి తోడు ఈ పీరియాడిక్ మూవీలో ఈ జోడీ ఎంత బావుంటుందోననే ఆశలు ఫ్యాన్స్ కి కూడా చాలానే ఉన్నాయి. 2020లో బెస్ట్ హిట్ అల వైకుంఠపురములో అందుకున్న పూజా హెగ్డే... 2021లో రాధేశ్యామ్ కూడా అంతకన్నా బెస్ట్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
2021లో పూజాకి ప్రభాస్ మూవీతో పాటు అఖిల్ మూవీ కూడా మొదలవుతుంది. అదేనండీ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అఖిల్ సంగతి ఎలా ఉన్నా... పూజా హెగ్డే వల్ల మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ తెగ డిస్టర్బ్ అవుతున్నారన్నది ఎవరూ నో చెప్పడానికి వీల్లేని విశ్వ మహా ట్రూత్...! అంతే కదా.. యాజ్ ఇట్ ఈజ్‌గా అంతేనన్నమాట!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni akhil, Ala Vaikunthapurramloo, Pooja Hegde, Prabhas, Radhe Shyam