టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను దక్కించుకుని .. అగ్ర కథానాయకులతో జోడీ కడుతున్న సొగసరి పూజాహెగ్డే. ఈ అమ్మడు ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌ను కూడా తెలివిగా హ్యాండిల్ చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో జోడీ కట్టింది. అలాగే అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తోనూ ఆడిపాడింది. కెరీర్ ప్రారంభం నుండి నేటి వరకు ఈ అమ్మడుకి గ్లామర్ డాల్ ఇమేజ్‌తోనే ముందుకు సాగుతోంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు నెక్ట్స్ రేంజ్‌కు వెళ్లాలని అనుకుంటోందట. హీరో పక్కనే సిగ్గుపడే అమ్మడులానే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను రాబట్టుకునే తనదైన ఇమేజ్‌ను రాబ్టుకోవాలని అనుకుంటోందట పూజా హెగ్డే. అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని భావిస్తుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ విషయానికి వస్తే అనుష్క, సమంత, నయనతార వంటి హీరోయిన్స్ చేసే చిత్రాలకు స్పెషల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు తాను కూడా అదే బాటలోకి రావాలని పూజా హెగ్డే కోరుకుంటోందట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలోనూ ఆ విషయాన్ని బట్టబయలు చేసిందట.
అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడమంటే అంత సులభమైన విషయమైతే కాదు.. ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్స్‌లోకి రప్పించడమంటే కత్తిమీద సామే. మరి ఈ విషయంలో పూజా హెగ్డే సక్సెస్ అవుతుందో లేదో తెలియడం లేదు. కానీ పూజా హెగ్డే కోరికను ఏ నిర్మాత తీరుస్తాడనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన విషయమే. వచ్చే ఏడాది మూడు చిత్రాలతో పూజా హెగ్డే అభిమానులను ఆకట్టుకుంటోంది. అందులో రెండు తెలుగు చిత్రాలు అయితే, ఓ చిత్రం బాలీవుడ్ మూవీ. పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. అలాగే అఖిల్‌తో చేసిన లవ్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా వచ్చే ఏడాదిలోనే సందడి చేయనుంది. కాగా.. బాలీవుడ్‌లో రణ్వీర్‌సింగ్‌తో కలిసి సర్కస్ మూవీలోనూ నటిస్తోంది. మరి ఈ మూడు చిత్రాలతో పూజా హెగ్డే ఎలాంటి సక్సెస్‌లను అందుకుంటుందో చూడాలి.
ముగమూడి సినిమాతో కెరీర్‌ను తమిళంలో స్టార్ట్ చేసినప్పటికీ తెలుగు ఇండస్ట్రీపైనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ హృతిక్ సరసన మొహంజదారో సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ టాలీవుడ్ వైపుకే అడుగులేసింది. అల్లు అర్జున్‌తో డీజే దువ్వాడ జగన్నాథమ్, మహేశ్‌తో మహర్షి, ఎన్టీఆర్‌తో అరవింద సమేత సినిమాలు చేసింది. అన్నీ సినిమాలు ప్రేక్షకాదరణ పొందడటంతో పూజాకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతమైంది. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డేనే టాప్ పోజిషన్‌లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Tolllywood