పూజా హెగ్డే కొంపముంచిన కరోనా వైరస్..

Pooja Hegde: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే నెంబర్ వన్ హీరోయిన్. ఈమెతో పోటీ పడటానికి కూడా రష్మిక మందన్న తప్ప సమీపంలో కూడా ఎవరూ లేరు. స్టార్ హీరోలందరి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 3:05 PM IST
పూజా హెగ్డే కొంపముంచిన కరోనా వైరస్..
ప్రభాస్ షూటింగ్‌కు బయల్దేరిన పూజా హెగ్డే (Pooja Hegde Mask)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే నెంబర్ వన్ హీరోయిన్. ఈమెతో పోటీ పడటానికి కూడా రష్మిక మందన్న తప్ప సమీపంలో కూడా ఎవరూ లేరు. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ పూజానే కనిపిస్తుంది.ఈ ఏడాది ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమాతో సంచలన విజయం అందుకుంది పూజా. ఈ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం దాదాపు 2 కోట్లకు పైగానే తీసుకుంటుంది పూజా హెగ్డే. దాంతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు అనుకోకుండా పూజాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఈమె చేతుల్లోంచి ఓ భారీ సినిమా చేజారిపోయింది.

పూజా హెగ్డే (pooja hegde)
పూజా హెగ్డే (pooja hegde)


అదే సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్.. సాజిద్ నడియావాలా నిర్మాణంలో వస్తున్న సినిమాకు చాలా రోజుల కిందే సైన్ చేసింది పూజా హెగ్డే. ఈ చిత్రం కోసమే తెలుగులో కొన్ని సినిమాలు కూడా వదిలేసుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా కోసం దాదాపు 4 కోట్ల వరకు పారితోషికం కూడా తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. దీని కారణంగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. డేట్స్ క్లాష్ అవుతుండటంతో సల్మాన్ ఖాన్ సినిమా నుంచి ఈమె తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పూజా హెగ్డే (pooja hegde)
పూజా హెగ్డే (pooja hegde)
కరోనా కారణంగా ఇప్పుడు ఈమె నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ప్రభాస్ సినిమాలు వాయిదా పడ్డాయి. నెక్ట్స్ ఈ రెండు సినిమాల డేట్స్ ఇచ్చిన తర్వాత సల్మాన్ దగ్గరికి వెళ్లాలి. అయితే అప్పటికే ఈ చిత్రం కూడా మొదలు కానుంది. దాంతో పూజాను నమ్ముకుంటే పని కాదని సల్లూ భాయ్ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడు. కరోనా నియంత్రణ అయిన తర్వాత ఒకేసారి ప్రభాస్, అఖిల్ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయనుంది పూజా. కరోనా వచ్చి పూజా కొంప ముంచేసిందన్నమాట.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు