యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ కథానాయిక రోజు బిర్యానీ క్యారేజ్ పంపిస్తున్నాడట. ఇపుడీ మ్యాటర్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి తెలిసిన వారెవరైనా సాహో అనాల్సిందే .. అంత పెద్ద నోరూరించే మెనూతో నోట మాట రానివ్వకుండా చేయడం ప్రభాస్ స్పెషాలిటీ. హీరోయిన్లు ప్రభాస్‌ను ఎంతలా ఇష్టపడతారో, అతడు పెట్టే భోజనాన్ని కూడా అంతే ఇష్టపడతారు. ప్రభాస్ పేరెత్తగానే హీరోయిన్లు ముందుగా చెప్పే విషయం తిండి గురించే.ఇంతకుముందు సాహో సెట్స్ లో శ్రద్ధా కపూర్ కి అలాంటి సర్ ప్రైజ్ ట్విస్ట్ ఎదురైంది. ప్రభాస్ తెచ్చిన క్యారేజీలో వంటకాల జాబితా చూసి కళ్లు తేలేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తన ప్రతి సినిమాలో కథానాయికలకు ఇంచుమించు ఇలాంటి సర్ ప్రైజ్ ట్రీటుంటుంది. చందమామ కాజల్ సైతం ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసింది. ఇక స్వీటీ అనుష్కకు అయితే ఇలాంటి క్యారేజీలతో ఎన్నో చెప్పాల్సిన పనిలేదు.
ప్రభాస్,పూజా హెగ్డే (Instagram/Photo)
ఇప్పుడు ‘జాన్’ కోస్టార్ పూజా హెగ్డే పరిస్థితి ఇంచు మించు అదేలా ఉంది.‘జాన్’ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ పంపిస్తోన్న లంచ్ బాక్స్ ఐటమ్స్ చూసి డైరెక్టర్స్ కోమాలోకి వెళ్ళిపోరు అంటూ చెప్పుకొచ్చింది.ఏదైనా ద్వీపానికి వెళ్లిపోతే అక్కడ నాతో ఒకరు ఉంటే సరిపోతుంది. అది ప్రభాస్ అయితే ఎంత బావుంటుందో. ఇప్పుడు నేను కోమాలో ఉన్నా. థాంక్యూ.. ఆ క్యారేజీ పంపించినందుకు అంటూ ప్రభాస్ పై ప్రేమతో కూడుకున్న ప్రశంసల్ని కురిపించింది. అంతేకాదు ప్రభాస్ నా పక్కనుంటే చాలు నేను భోజనం గురించి ఆలోచించడం మానేస్తానంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఖాళీగా ఉంటే మటన్ బిర్యానీ అద్భుతంగా చేస్తాను. ప్రభాస్‌కు కూడా అదే ఇష్టం. సెట్స్ లో ప్రభాస్ ఉంటే మెల్లగా ఆయన చెవిలో అదే చెబుతాను. వెంటనే బిర్యానీ వచ్చేస్తుంది అంటూ డార్లింగ్ లంచ్ బాక్స్ అభిమానుల లిస్టులో చేరిపోయింది అరవింద.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.