ఆచార్య, బీస్ట్, రాధే శ్యాం... ఈమూడు సినిమాలు బిగ్ ప్రాజెక్టులే. అయితే ఈ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. పూజ హెగ్డే ఐరెన్ లెగ్ అంటూ ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు.. ఆమెకి ఇక సినిమా ఛాన్సెస్ రావేమో అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఆమెకి విజయ్ దేవరకొండతో జనగణమణ, సల్మాన్ ఖాన్ తో అవకాశాలు క్యూ కట్టాయి, మరోవైపు మహేష్ బాబు సైతం పూజను మరో సినిమాలో హీరోయిన్గా తీసుకుంటున్నాడు.
ఇప్పటికే మహేష్ బాబు తో SSMB28 లో హీరోయిన్ గా మహేష్ సరసన నటించబోతుంది పూజా. ఈ మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న పూజకు మరో అదిరిపోయే ఆఫర్ వచ్చింది. మరో సూపర్ ఛాన్స్ దొరికింది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా అని సమాచారం.. సూర్య చిరుతై శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే సూర్య కి జోడిగా పూజ హెగ్డే ని సంప్రదిస్తున్నారట.
ఇప్పటివరకు కోలీవుడ్ లో పూజ హెగ్డే కి ఓ మంచి సినిమా కూడా దక్కలేదు. రెండు సినిమాలు చేసింది రెండు సినిమాలూ ప్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు సూర్య సినిమాలో ఛాన్స్ వస్తే.. నిజంగా పూజ హెగ్డే కి సూర్య అయినా హిట్ ఇస్తారేమో చూడాలి. అంతేకాదు ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించనున్నారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇది సూర్య స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్ అని.. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్. మరి దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవేళ తెలుగులో తెరకెక్కించినా.. తమిళ, మలయాళ భాషల్లో కచ్చితంగా రిలీజ్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beast, Hero suriya, Pooja Hegde