చిన్నపుడే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అఖిల్.. హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఒక్క హిట్‌ను కొట్టలేకపోయాడు. ఈయన నటించిన మూడు సినిమాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. స్టోరీ సెలెక్షన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. తాజాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. తొలి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోలేదు భాస్కర్. దాంతో అఖిల్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు ఈయన.
ఈ సినిమాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమా చేస్తున్నాడు. పైగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ నిర్మిస్తుండటంతో నమ్మకం కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయింది. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కూడా చివరికి పూజాను ఫైనల్ చేసారు దర్శక నిర్మాతలు. కొన్ని కారణాల వల్ల రష్మిక మందన్నతో పాటు ఇంకొందరు హీరోయిన్లు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.తాజాగా పూజా హెగ్డు ఫిక్స్ చేసినట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
Beautiful & energetic actress @hegdepooja is going to be a part of #Akhil4@AkhilAkkineni8 #BommarilluBhaskar #GopiSunder #PradeeshMVarma#BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/ShJUBDO9Ef
— BARaju (@baraju_SuperHit) September 14, 2019
ఇక ఇప్పుడు పూజాను కన్ఫర్మ్ చేయడంతో అక్కినేని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కోసం రూ. 1.25 కోట్ల పారితోషికం అందుకుంటుంది పూజా హెగ్డే. నిజానికి ఇది చాలా పెద్ద అమౌంట్. అఖిల్ సరసన పూజా హెగ్డే నటించడమే విచిత్రం అనుకుంటే.. ఈ జోడీని భాస్కర్ స్క్రీన్‌పై ఎలా చూపిస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదివరకే సవ్యసాచిలో నాగచైతన్యతో జోడీ కట్టిన నిధి అగర్వాల్‌తో మిస్టర్ మజ్ను చేసాడు అఖిల్. ఇకిప్పుడు ఒక లైలా కోసం హీరోయిన్ పూజాతో రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. మరి ఈమె అయినా అఖిల్ కోరుకుంటున్న విజయం తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Pooja Hegde, Telugu Cinema, Tollywood