Pooja Hegde Next Movie: వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో అదరగొడుతోన్న పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా రాణిస్తోంది. అందులో భాగంగా ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది. తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. ఇక ఆ మధ్య బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదలకానుంది. అది అలా ఉంటే పూజా హెగ్డేకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు తెలుగులో అదరగొడుతోన్న ఈ భామకు తమిళ్‌లో సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 2012లో ‘ముగమూడి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఆమె ఆ సినిమా పెద్దగా గుర్తింపును ఇవ్వలేదు. తాజాగా ఇన్ని సంవత్సరాలకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తమిళంలోకి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం వచ్చింది.
అది కూడా మూములు ఆఫర్ కాదు. ఏకంగా దళపతి విజయ్ సరసన అని టాక్.. విజయ్ ఇటీవలే అక్కడ ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత విజయ్ త్వరలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ఇక పూజా హెగ్డే ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ రాధేశ్యామ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.
ఈ సినిమాలే కాకుండా తెలుగులో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది పూజా. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Tamil Film News