పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్... మరో క్రేజీ కాంబినేషన్‌లో..

పూజా హెగ్డే..  నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమై వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు వారికి మరింతగా దగ్గరైంది.

news18-telugu
Updated: March 30, 2020, 1:28 PM IST
పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్... మరో క్రేజీ కాంబినేషన్‌లో..
పూజా హెగ్డే Photo : Twitter
  • Share this:
పూజా హెగ్డే..  నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత  మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.

pooja hegde tamil films, pooja hegde latest news, pooja hegde,pooja hegde songs,pooja hegde hot,pooja hegde movies,pooja hegde photoshoot,pooja hedge,pooja hegde kiss,pooja hegde bra,pooja hegde bag,pooja hegde bts,pooja hegde gym,pooja hegde look,pooja hehde,pooja,pooja hegde hot dj,pooja hegde dance,పూజా హెగ్డే,పూజా హెగ్డే న్యూస్,
సూర్య, పూజా హెగ్డే Photo : Twitter


అంతేకాదు దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది. ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది.
First published: March 30, 2020, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading