Pooja Hegde : తొలిసారి కెరీర్‌లో ఆ సినిమా కోసం అలా చేయబోతున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ మజాకా..

పూజా హెగ్డే (Twitter/Photo)

Pooja Hegde : తొలిసారి తన ఫిల్మ్ కెరీర్‌లో ఆ సినిమా కోసం అలా చేయబోతున్న పూజా హెగ్డే.. వివరాల్లోకి వెళితే.. ప్రెజెంట్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

 • Share this:
  Pooja Hegde : తొలిసారి తన ఫిల్మ్ కెరీర్‌లో ఆ సినిమా కోసం అలా చేయబోతున్న పూజా హెగ్డే (Pooja Hegde).. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. అందులో ఈ భామ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) సినిమాలో నటించింది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 8న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు.  ఈ సినిమాపైనే అఖిల్ తన అశలన్ని పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం ఆయన కెరీర్‌కు ఎంతో అవసరం. అది అలా ఉంటే ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది.

  అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున చూశారట. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని సమాచారం. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరినట్టు సమాచారం. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉందట. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం.

  Bandla Ganesh - Degala Babji : ‘డేగల బాబ్జీ’ గా బండ్ల గణేష్ లుక్ అదుర్స్.. వైరల్ అవుతున్న ఫోటో..


  మరోవైపు నాగార్జున కూడా తన కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే తొలిసారి తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూజా హెగ్డే మొదలు పెట్టింది.


  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించారు.  ఇక పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించింది. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ  తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  మరోవైపు పూజా హెగ్డే.. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఓ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ సినిమాను ఎపుడు విడుదల చేస్తారనేది చూడాలి. పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తోంది. మరోవైపు తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. ఇంకోవైపు అల్లు అర్జున్ ..‘ఐకాన్’లో ఈమెనే నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: