పూజా హెగ్డే దూకుడు వెనక అసలు రహస్యం ఇదేనా...

pooja hegde | పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలతో దూసుకుపోతుంది

news18-telugu
Updated: December 19, 2019, 1:30 PM IST
పూజా హెగ్డే దూకుడు వెనక అసలు రహస్యం ఇదేనా...
పూజా హెగ్జే (Instagram/Photo)
  • Share this:
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాదు ప్రస్తుతం స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇదిలావుంటే ముంబై నుంచి ఎందరు భామలు టాలీవుడ్ కి వస్తున్నా.. అందరిలో ఎంతో స్పెషల్ గా ట్రీటిస్తోంది పూజా హెగ్డే. తన కెరీర్ కి ఎలాంటి ఢోకా లేకుండా నడిపించేస్తోంది. ఇండస్ట్రీ టాప్ హీరోలందరినీ కొంగున కట్టేసుకుంటోంది. అసలు అంతగా పూజాలో ఏం ఉంది? అంటే... సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే హాటె అప్పియరెన్స్ తో కవ్వించే విలక్షణత పూజాలో ఉంది. అందుకే ఈ అమ్మడికి ఎదురే లేకుండా పోయింది అనుకుంటున్నారు కొందరు సినీజనాలు. పూజలో ఇదో యాంగిల్ అయితే మరో కోణం.. పూజ ఫోటో షూట్స్ అంటున్నారు మరికొందరు. అవకాశాలు ఎన్నో వస్తాయి కానీ కెరీర్ ను మలుపు తిప్పే లక్కీ ఛాన్స్ ప్రతి సారీ రాదు. అది వచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హీరోయిన్ ఒక్కొక్కరు ఒకో విధంగా స్టార్ డమ్ ని కాపాడుకుంటూ వస్తుంటారు. ఆ తరహాలో డీజే బ్యూటీ పూజా హేగ్దే గత కొంత కాలంగా తన ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తోంది. ఎప్పుడైతే అమ్మడికి దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందో అప్పుడే వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి దీనికి కారణం తన సెక్సీ ఫొటో షూట్స్ వల్ల అమ్మడు బడా సినిమాల్లో అవకాశాలను అందుకుంది అంటున్నారు.

pooja hegde hot cleavage show go viral on social media,happy birthday pooja hegde,pooja hegde,pooja hegde,ala vaikunthapuramulo,ala vaikunthapurramuloo,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,ala vaikuntapuram,ala vaikunthapuramulo teaser,ala vaikunthapurramuloo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo teaser,ala vaikunthapurramuloo trailer,ala vaikuntapuram lo,ala vaikuntapuramulo,ala vaikunta puram lo teaser,ala vaikunta puram lo,ala vaikunthapuramulo movie,ala vaikuntapuram lo songs,ala vaikunta puram lo songs,ala vaikunta puram,housefull4,house full 4,hf4,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పూజా హెగ్డే అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో పూజా హెగ్డే,అల్లు అర్జున్ పూజా హెగ్డే,పూజా హెగ్డే
పూజా హెగ్జే (Instagram/Photo)


ప్రస్తుతం ప్రభాస్ సరసన 'జాన్' చిత్రంలో నటిస్తోన్న పూజ పనిలో పనిగా అఖిల్ సరసన కూడా నటించేస్తోంది. అయితే తన స్టార్ డమ్ ని కొనసాగించేందుకు పూజా నిరంతర ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది. రెగ్యులర్ ఫోటోషూట్లతో పూజా ఇస్తున్న ట్రీట్ గురించి చెప్పాల్సిన పనేలేదు. తాజా ఫోటోషూట్ యూత్ లో వైరల్ గా మారింది. ఆఫ్ షోల్డర్ టాప్ .. బ్లాక్ స్కర్ట్ లో పూజా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు