వీరాభిమాని చేసిన పనికి పూజా హెగ్డేకి మాటలు రావడంలేదట..

తన వీరాభిమాని చేసిన పనికి మాటలు రావడంలేదంటోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇంతకీ ఆమె రియాక్షన్‌కి కారణం ఏంటంటే?

news18-telugu
Updated: January 14, 2020, 7:12 PM IST
వీరాభిమాని చేసిన పనికి పూజా హెగ్డేకి మాటలు రావడంలేదట..
పూజా హెగ్డే (Photo:Twitter)
  • Share this:
పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడింది పూజా. అల్లు అర్జున్ సరసన 'డీజే'లో హాట్‌గా అదరగొట్టిన ఈ భామ...ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది. తర్వాత మహేష్‌ బాబు సరసన ‘మహర్షి’లో నటించి మంచి హిట్ అందుకుంది. ఇటీవల వరుణ్‌తో ‘వాల్మీకి’ చిత్రంలో మరో సారి ఆడిపాడింది. గద్దలకొండ గణేష్‌గా వచ్చిన ఈ సినిమాలో అలనాటి శ్రీదేవి హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో' అనే పాటలో అదరగొట్టింది.

సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన మురిపించిన పూజా హెగ్డే మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ కలెక్షన్లు రికార్డులు తిరగరాస్తుండడంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో క్రేజు ఒక్కసారిగా పీక్‌కి చేరిపోయింది. తాజాగా ఓ వీరాభిమాని పూజా హెగ్డే పేరుని తన చేతిపై పచ్చబొట్టులా పొడిపించుకున్నాడు. తద్వారా ఆమెపై తనకున్న అభిమానం ఏపాటితో నిరూపించుకునే ప్రయత్నంచేశాడు. ఈ ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో పూజా హెగ్డే రియాక్ట్ అయ్యింది. తన వీరాభిమాని చేసిన పనికి ఎంతో మురిసిపోయింది. తనకు మాటలు రావడం లేదని...ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నట్లు పేర్కొంది. తనపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పింది.


First published: January 14, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading