POOJA HEGDE SPECIAL SONG IN F3 MOVIE POSTER RELEASE SB
F3లో ఐటమ్ సాంగ్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరు?.. అనిల్ రావిపూడి టెస్ట్
ఫూజ హెగ్డే
ఎఫ్3 సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. దీనికి భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి .. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరు. సీరియస్, కామెడీ,ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలను తీసుకొస్తూ.. అభిమానులకు ఫుల్ ప్యాకేజీ వినోదాన్ని పంచుతుంటారు. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ తీస్తున్న మూవీ ఎఫ్3. అంతకుముందు ఎఫ్2 తీసి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎఫ్3 సినిమాలో ఓ అందాల భామతో ఐటెం సాంగ్‌కు ప్లాన్ చేస్తున్నాడీ యంగ్ డైరెక్టర్. సరిలేరు నీకెవ్వరులో తమన్నాతో ‘ఆజ్ రాత్ మేరె ఘర్ మే పార్టీ హై’ అంటూ స్టెప్పులేయించి స్పెషల్ సాంగ్ చేయించాడు. తాజాగా మరో ముద్దుగుమ్మతో ఎఫ్3లో కూడా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో అనిల్ రావిపూడి ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ.. ఇందులో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పాలంటూ తన అభిమానులకు, నెటిజన్లకు ఓ చిన్న టెస్ట్ పెట్టాడు. అయితే ఆ ఫోటోను చూసిన వారంతా.. ఈమె ఖచ్చితంగా పూజా హెగ్డే అని జవాబు ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో పూజా నటించనున్నట్లు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పూజాహెగ్డే ‘ఎఫ్-3’ స్పెషల్ సాంగ్ షూట్లో జాయిన్ అయినట్లు మేకర్స్ పూజా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
2019లో వచ్చిన ‘ఎఫ్-2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ తెరకెక్కింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేస్తుండగా, కేవలం ఒక్క పాటకే ఆమెకు కోటి రెమ్యూనరేషన్ అందుతున్నట్టు తెలుస్తోంది. అది దాదాపు ఒక సినిమాకి వచ్చే రెమ్యునరేషన్. మరి పూజకు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా నిర్మాతలు సైతం ఈ బ్యూటీ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద ‘జిగేల్ రాణి’ అంటూ ‘రంగస్థలం’లో చరణ్‌తో స్టెప్పులేసిన ఈ పొడుగుకాళ్ళ సందరి ఇప్పుడు ‘ఎఫ్-3’లో స్పెషల్ సాంగ్‌లో చేసేందుకు సిద్ధమైపోయింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.