నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే,..ఆ తర్వాత చేసిన ‘ముకుందా’ సినిమాతో మురిపించలేకపోయింది. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ సరసన ‘మొహంజోదారో’ సినిమాలో యాక్ట్ చేసిన ఈ అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు.ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంతో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయిన ఈ సినిమాలో పూజా ఆరబోసిన అందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే కదా. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంతో ఎన్టీఆర్ సరసన చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది.
ఈ ఇయర్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాతో మరో హిట్టు అందుకుంది. తాజాగా ఈ భామ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకి’లో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో అలనాటి ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి చేసిన ఎల్లువచ్చే గోదారమ్మా పాటను వరుణ్ తేజ్‌తో కలిసి రీమిక్స్ చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఈ భామకు మంచి క్రేజ్ ఉంది.
ఇక అల్లు అర్జున్‌తో చేసిన ‘డీజే’కు ముందు చాలాకాలంపాటు సరైన అవకాశాలు రాక అల్లాడిన పూజాహెగ్దెకు కాలం కలిసి రావడంతో ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చేసింది. లెక్కకుమించి అవకాశాలు.. చేతినిండా సినిమాలు.. కోట్లలో రెమ్యునరేషన్.. ఓహ్ తిరుగులేని డిమాండ్ సాధించుకున్న పూజ ఆ టెంపర్‌ను తన ప్రవర్తనలోనే చూపిస్తోందంటూ దర్శక నిర్మాతలు కన్నెర్ర చేస్తున్నారట. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని మర్చిపోయి దర్శక నిర్మాతల సహనానికి ఈ బ్యూటీ పరీక్ష పెడుతుందన్న కామెంట్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువవుతున్నాయనే టాక్ వినబడుతోంది. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ ఈ భామ వల్లే ఆలస్యానికి కారణమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్లకు తేవాల్సి ఉండటంతో శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి పక్కాగా వేసుకున్న త్రివిక్రమ్ ప్రణాళికలు పూజా కారణంగా తలకిందులవుతున్నాయన్నది టీంనుంచి వినిపిస్తోన్న మాట.మొత్తానికి ఇండస్ట్రీలో టెంపర్ చూపించి భామలు చాలా మందే తెరమరుగైపోయారు. అలాంటి పరిస్థితి రాకముందే జాగ్రత్త పడటం పూజా హెగ్దెకు ఎంతైనా అవసరం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Pooja Hegde, Telugu Cinema, Tollywood, Trivikram, Valmiki, Varun Tej