Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 7, 2018, 4:03 PM IST
అరవింద సమేత
హీరోల డామినేటెడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు మంచి పాత్రలు దొరకడమే గగనంగా మారిపోయిందిప్పుడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో.. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ కలిసి అమ్మాయి పేరుతో సినిమా చేసారు. అదే "అరవింద సమేత". టైటిల్లోనే హీరోయిన్ పేరు ఉందంటే ఏ స్థాయిలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందో అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే అంటున్నాడు. ఇప్పటి వరకు పూజా చేసిన సినిమాలెలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం ఆమె పాత్ర అద్భుతం అంటున్నాడు.

పూజా హెగ్దే ఇన్స్టాగ్రామ్ ఫోటోలు (instagram/hegdepooja)
ఇంత అద్భుతంగా నటిస్తుందని తాము అయితే అనుకోలేదని చెప్పాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో కచ్చితంగా పూజా నటన గురించి మాట్లాడుకుంటారని చెబుతున్నాడు ఈయన. ఇక త్రివిక్రమ్ కూడా పూజాహెగ్డేపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా ఇప్పుడు పూజాకు కీలకం. అమ్మాయికి అందం టన్నుల్లో ఉంది.. కానీ అదృష్టమే అస్సల్లేదు. అయినా కూడా తెలుగులో ఒకేసారి మూడు భారీ సినిమాల్లో.. ముగ్గురు సూపర్ స్టార్స్‌తో నటిస్తుంది పూజా. ఎన్టీఆర్ "అరవింద సమేత".. మహేశ్ "మహర్షి".. ప్రభాస్-రాధాకృష్ణ సినిమాల్లో హీరోయిన్ ఈ భామే. అందరికంటే ముందు పూజా లెగ్గు మహిమను తట్టుకోడానికి సవాల్ చేస్తున్న హీరో ఎన్టీఆర్.

అరవింద సమేత
"అరవింద సమేత" అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమాతో కచ్చితంగా తన ఫేట్ మారుతుందని భావిస్తుంది పూజాహెగ్డే. మారుతుందని ఎన్టీఆర్ మాటలతో అర్థం అయిపోతుంది. తెలుగులో ఇప్పటి వరకు ఈమె నటించిన "ముకుందా".. "ఒక లైలా కోసం".. "డిజే".. "సాక్ష్యం" అన్నీ పోయాయి. "డిజే" యావరేజ్ కానీ హిట్ కాదు. హిందీలో హృతిక్ రోషన్‌తో నటించిన "మొహింజదారో".. తమిళ్లో జీవాతో నటించిన "ముగమూడి" కూడా ఫ్లాప్ అయ్యాయి. అన్ని సినిమాలు పోయినా కానీ అందాలే ఈమెకు పెట్టుబడి. దాంతో "అరవింద సమేత"తో తెలుగులో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తుంది పూజాహెగ్డే. మొత్తానికి అందంతోనే కాకుండా అభినయంతో కూడా ఆకట్టుకోవాలని చూస్తుంది ఈ అందాల అరవింద.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 7, 2018, 4:03 PM IST