శ్రీదేవిగా పూజా హెగ్డే.. అదిరిపోయిన ఫస్ట్ లుక్...

Pooja Hegde : పూజా హెగ్డే.. దాదాపు ఆరేళ్ల క్రితం మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుందా’ సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: August 26, 2019, 8:00 AM IST
శ్రీదేవిగా పూజా హెగ్డే.. అదిరిపోయిన ఫస్ట్ లుక్...
Instagram.com/hegdepooja
  • Share this:
పూజా హెగ్డే.. దాదాపు ఆరేళ్ల క్రితం మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుందా’ సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైంది.  ఆ తర్వాత వెంటనే.. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు.. అనుకున్నంత  ఆడలేదు. దీంతో  అల్లు అర్జున్ 'డీజే' సినిమా వచ్చే దాకా పూజా హెగ్డేకు తెలుగులో గొప్పగా గుర్తింపు రాలేదు.  'డీజే' ఎప్పుడైతే.. హిట్ అయ్యిందో.. ఆ తరువాత నుంచి ఈ భామ కెరీర్ పరుగు లంకించ్చుకుంది. అప్పటినుండి..  పూజా హెగ్డే స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటోంది. దానికి తోడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ తర్వాత మహేష్ 'మహర్షి'తో మరో హిట్ అందుకుంది. అది అలా ఉంటే పూజాహెగ్డే మరోసారి మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌‌తో 'వాల్మీకి' సినిమా చేస్తోంది. ఈ సినిమాను హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

View this post on Instagram
 

From our hearts to yours...Bringing you.....Sridevi ❤️ #Valmiki #Sridevi @harish2you @varunkonidela7


A post shared by Pooja Hegde (@hegdepooja) on

కాగా ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో శ్రీదేవి‌గా పూజా కనిపించనున్నారు. సైకిల్‌పై వెళ్తూ.. వింటేజ్ లుక్‌లో అదిరిపోయింది పూజా హెగ్డే లుక్. 'వాల్మీకి' తమిళ్‌లో హిట్ అయిన 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో ఇంకా.. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.
First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు