Pooja Hegde: పూజా హెగ్డే కెరీర్‌లోనే కాదు.. ప్రతి హీరో, హీరోయిన్లు, నటీ నటుల కెరీర్‌లో కొన్ని చిత్రాలు వారి కంటూ స్పెషల్‌గా గుర్తింపును తీసుకొస్తాయి. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్‌లో కూడా ఓ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉందట. తెలుగుతో పాటు తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఈ శాండిల్‌వుడ్ భామకు తెలుగులో నటించిన ఆ చిత్రమే ఆమె కెరీర్‌లో స్పెషల్ అని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెలుగులో పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. ఆ తర్వాత పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో పూజా తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది.
ఐతే.. ఇన్ని సినిమాల్లో నటించిన ఈ భామకు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్టు వివరణ ఇచ్చింది. ఈ సినిమాలో అరవిందగా వీరరాఘవకుడిలోని ఆవేశానికి కాకుండా ఆలోచనకు పదును పెట్టే అమ్మాయిగా చక్కగా ఒదిగిపోయింది. అంతేకాదు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో నా కెమిస్ట్రీ బాగా కుదరిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు డబ్బింగ్ కాకుండా నటనా పరంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ తన కెెరీర్‌లో స్పెషల్‌గా అంటూ చెప్పింది. ఈ సినిమాతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంది. నా కెరీర్‌లో ఇక ముందు ఎన్ని మంచి పాత్రలు చేసినా.. ‘అరవింద సమేత వీరరాఘవ’ ఎప్పటికీ నా ఫేవరేట్ మూవీగా నిలిచిఉంటుందని చెప్పింది. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravinda sametha, Jr ntr, Pooja Hegde, Tollywood, Trivikram