Pooja Hegde: పూజా హెగ్డే చేసిన పనికి ఆశ్యర్యపోతున్న సినీ ఇండస్ట్రీ..
'డిజె’ సినిమా తో హాట్ బ్యూటీ పూజ హెగ్డే రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందాన్ని ఆరబోసిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.
news18-telugu
Updated: September 19, 2019, 10:53 AM IST

పూజా హెగ్డే Instagram.com/hegdepooja
- News18 Telugu
- Last Updated: September 19, 2019, 10:53 AM IST
'డిజె’ సినిమా తో హాట్ బ్యూటీ పూజ హెగ్డే రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందాన్ని ఆరబోసిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఈ ఇయర్ ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసిన ఈమె ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల తెరకెక్కనున్న ‘అల వైకుంటపురంలో’ సినిమాలో కూడా పూజా హెగ్డే బన్నీతో మరోసారి రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ని పూజా హెగ్డే ఒక ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ పూజాతో కలిసి నటించేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. పూజా కెరీర్లో ఇప్పటివరకు ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘మహర్షి’ సినిమాలు హిట్టైయినా.. బ్లాక్ బస్టర్ మాత్రం అనిపించుకోలేకపోయాయి.

స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే… అరవింద సమేత, మహర్షి, ప్రభాస్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా.. ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చింది అని తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్ బాబు మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్నారట.ఈ షెడ్యూల్స్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేది అని తెలిపింది. కొంచెం కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది పూజ.

పూజా హెగ్డే (Photo: hegdepooja/Instagram)