Pooja Hegde: ఓ చిన్నారి చేసిన ప్రశంసకు పూజా హెగ్డే ఉబ్బితబ్బివు తోంది. వివరాల్లోకి వెళితే.. పూజా హెగ్డే తెలుగులో ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైన ఈ భామ.. తర్వాత వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపంచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తెలుగు బాట పట్టింది. ఈ సారి హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుసగా ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.
Omgggg this adorable little one just made my day! Cutest cheeks ever! Sending her ALL my love and virtual kisses 😘😘😘😘 Hope to meet her some day 🤗 https://t.co/ZyS9OSUXDW
— Pooja Hegde (@hegdepooja) November 10, 2020
తెలుగులో నెంబర్ వన్ రేసులో దూసుకుపోతున్న ఈ భామను ఓ చిన్నారి ఫిదా చేసింది. ఆ చిన్నారి పూజా గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ చిన్నారిని ఒకతను ఒక ప్రశ్న వేసాడు. నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని అడిగితే.. వెంటనే తడుముకోకుండా పూజా హెగ్డే అని చెప్పింది. దాంతో పాటు పెద్దయ్యాక ఏమవుతావు అని ఆ వీడియోలో ఓ వ్యక్తి బాలికను ప్రశ్న వేస్తే.. ఆ చిన్నారి పూజా హెగ్డే ను అవుతానంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు పూజా హెగ్డే చాలా అందంగా ఉంటుంది. అందుకే ఆమెంటే చాాలా ఇష్టం అంది. ఈ వీడియోను పూజా హెగ్డే తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఓ మై గాడ్.. ఈ బుజ్జాయి వీడియో నా రోజును పరిపూర్ణం చేసింది. ఈ చిన్నారి బుగ్గలు ఎంత ముద్దుగా ఉన్నాయో అంటూ నా లవ్‌ను ఈ ట్వీట్ ద్వారా ఆ చిన్నారికి పంపిస్తున్నట్టు పూజా తెలియజేసింది. అంతేకాదు ఏదో ఒక రోజు .. ఆ బుజ్జాయిని కలుస్తానంటూ కామెంట్ చేయడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Pooja Hegde, Tollywood