రష్మిక మందన, పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు. అయితే, ఇప్పుడు వీళ్లు తమ స్టామినాను నిరూపించుకునే పనిలో ఉన్నారు. రష్మిక తన హావభావాలతో ఫ్లాట్ చేస్తే, పూజా మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా కావాల్సినంత గ్లామర్ షోకి రెడీ అంటుంది. ఒకరు కెమిస్ట్రీ లో బెస్ట్ అయితే..మరొకరు మల్టీ టాలెంటెడ్. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది.మరి సంక్రాంతికి విడుదల కాబోతున్న మహేష్‌బాబు-అనిల్ రావిపూడిల కాంబోలో ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబోలో ‘అల... వైకుంఠపురములో...’ సినిమాలతో పోటిపడుతున్నారు.రష్మిక, పూజా ఇద్దరూ సైజ్ జీరో మెయింటెయిన్ చేస్తుంటారు. అంతేకాదు ఇప్పుడు ఈ ఇద్దరు చేస్తున్న సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు పడ్డాయి. దీంతో వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. అయితే రష్మిక కంటే పూజా సీనియర్.అయితే సక్సెస్ పరంగా రష్మిక కంటే పూజానే వెనుకబాటులో ఉంది.
ఇక రష్మిక విషయానికొస్తే.. వరుస సక్సెస్ లతో ఛాన్సులు అందుకుంటుంటే..పూజ లక్కీ ఛామ్ గా గ్లామర్ ఎలివేషన్ తోనే అవకాశాలు ఒడిసిపట్టుకుంటోంది. ఇక రష్మిక ఇప్పటికే తన నటనతో ప్రూవ్ చేసుకుంది. కానీ పూజా ఇప్పటి వరకు నటన పరంగా నిరూపించుకోలేకపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దిరికీ బాగానే ఉంది. ఫాలోయింగ్ పరంగా పొలిక చూస్తే ఓ మెట్టు రష్మిక కన్నా పూజా నే పైనుంది. ఏదేమైనా ఈ సంక్రాంతికి వీరి పెర్ఫార్మన్స్ పరంగా ఎవరికీ ఎక్కువ మార్కులు పడతాయో తేల్చి చెప్పేది ప్రేక్షుకులే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Mahesh Babu, Pooja Hegde, Rashmika mandanna, Sandalwood, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood