హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: కథానాయికగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మొదటి పారితోషకం ఎంతో తెలుసా..

Pooja Hegde: కథానాయికగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మొదటి పారితోషకం ఎంతో తెలుసా..

Pooja hegde

Pooja hegde

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలతో పాటు నార్త్‌లో కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో ఈమె ఒకరు. హీరోయిన్‌గా ఈమె తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..

  Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా దక్షణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో  కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం సౌత్‌లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతోంది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న ఈ భామ.. తన తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్యర్యపోతారు. పూజా  ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. తనకు సంబంధించిన ఫ్యాషన్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటి కప్పడు తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ముందుగా ఈ  సినిమాను 30 జూలై విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో  ఈ సినిమా రిలీజ్ డేట్ పై సందిగ్థత నెలకొంది.

  మరోవైపు పూజా హెగ్డే..  అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన  యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే ఆమె యాక్ట్ చేస్తోన్న ‘రాధే శ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ’ఆచార్య’ సినిమాల్లో తన పార్ట్‌‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసింది.  ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.మరోవైపు పూజా హెగ్గే మరో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్టు సమాచారం.

  Prabhas Surprise Gift to radhe Shyam Movie Unit Here are the Details, Prabhas:Prabhas: ‘రాధే శ్యామ్’ యూనిట్‌కు ప్రభాస్ సర్‌ఫ్రైజ్ గిప్ట్.. పూజా హెగ్డే సహా అందరినీ మాయ చేసిన రెబల్ స్టార్.. ,prabhas,Prabhas Radhe Shyam,Prabhas Surprise Gift to radhe Shyam Movie Unit,Prabhas Salaar,Salaar Movie,Prabhas Salaar Movie Opening,Prabhas radhe shyam italy schedule completed,prabhas twitter,prabhas italy,prabhas craze in italy,prabhas birthday oct 23rd,prabhas radhe shaym movie music director justin prabhakaran,prabhas radhe shaym movie teaser on oct 23rd,justin prabhakaran prabhas,prabhas beats of radhe shayam on oct 23rd,surprise of prabhas fans,ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,అక్టోబర్ 23న ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,రాధే శ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం,ఇటలీలో ప్రభాస్ క్రేజ్,ఇటలీలో ప్రభాస్ క్రేజ్,ప్రభాస్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్,ప్రభాస్ రాధే శ్యామ్ షెడ్యూల్ కంప్లీట్,రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్,ప్రభాస్ సలార్,ప్రభాస్ సలార్ మూవీ ఓపెనింగ్
  రాధే శ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే(Twitter/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. పూజా హెగ్డే.. సినిమాల్లో రాకముందు నుంచి వాళ్ల అమ్మ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో పూజాకు కొన్ని పాఠాలు కూడా నేర్పిందట.  అందుకే పూజా హెగ్డే.. తన సంపాదించిన సంపాదనను కూడా అమ్మ చేతిలోనే పెట్టేదట. ఈమె తొలిసారి జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాలో కథానాయికగా నటించింది. అంతకు ముందు మోడల్‌గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట.

  chiranjeevi,chiranjeevi twitter,ram charan twitter,chiranjeevi ram charan acharya movie,chiranjeevi ram charan acharya movie neelambari song leaked,chiranjeevi ram charan acharya movie mani sharma music,chiranjeevi ram charan acharya movie koratala siva,chiranjeevi ram charan acharya movie song leaked online,pooja hegde ram charan,రామ్ చరణ్ పూజా హెగ్డే ఆచార్య,రామ్ చరణ్ పూజా హెగ్డే నీలాంబరి సాంగ్ ఆచార్య లీక్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ ఆచార్య
  ఆచార్యలో రామ్ చరణ్ పూజా హెగ్డే (Ram Charan Pooja Hegde)

  తమిళంలో ‘మూగముడి’ తర్వాత పూజా హెగ్డే తెలుగు విషయానికొస్తే..  నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. ఆ తర్వాత పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా  తన  గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.

  Most eligible bachelor, Most eligible bachelor release date,Akhil Akkineni PooJa Hegde Most eligible bachelor release date officially confirmed, Akhil Akkineni, Akhil Akkineni latest film, Akhil Akkineni most eligible bachelor pre teaser , surender reddy, Bommarillu Bhaskar, most eligible bachelor, akhil akkineni new movie, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌,most eligible bachelor,అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌, tollywood news
  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజా, అఖిల్ (File/Photo)

  ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై  ‘సాక్ష్యం’  సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. త్వరలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో పాటు అఖిల్  ’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చిరు, చరణ్‌ల ‘ఆచార్య’లో  హీరోయిన్‌గా తన సత్తా చూపెట్టబోతుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Bollywood news, Most Eligible Bachelor, Pooja Hegde, Radhe Shyam, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు