Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ అదేనండి.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలతో పాటు బీటౌన్‌లో కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం సౌత్‌లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతోంది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న ఈ భామ.. తన తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్యర్యపోతారు. పూజా ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. తనకు సంబంధించిన ఫ్యాషన్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాదు ఎప్పటి కప్పడు తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకుంది.
మరోవైపు ఈమె ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’లో సినిమాలో రామ్ చరణ్ సరసన నీలాంబరి పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. దాంతో పాటు ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.మరోవైపు పూజా హెగ్గే మరో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్టు సమాచారం.
ఆ సంగతి పక్కన పెడితే.. పూజా హెగ్డే.. సినిమాల్లో రాకముందు నుంచి వాళ్ల అమ్మ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో పూజాకు కొన్ని పాఠాలు కూడా నేర్పిందట. అందుకే పూజా హెగ్డే.. తన సంపాదించిన సంపాదనను కూడా అమ్మ చేతిలోనే పెట్టేది. ఈమె తొలిసారి జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాలో కథానాయికగా నటించింది.
Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనక ఇంత పెద్ద కథ ఉందా..
అంతకు ముందు మోడల్‌గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట.
తమిళంలో ‘మూగముడి’ తర్వాత పూజా హెగ్డే తెలుగు విషయానికొస్తే.. నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. ఆ తర్వాత పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.
Balakrishna - Srinu Vaitla : బాలయ్యతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా తెలుసా..
ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.
ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. త్వరలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో పాటు చిరు, చరణ్‌ల ‘ఆచార్య’లో హీరోయిన్‌గా తన సత్తా చూపెట్టబోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘భవదీయుడు భగత్ సింగ్’లో హీరోయిన్‌గా పూజాహెగ్డేనే నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Most Eligible Bachelor, Pooja Hegde, Radhe Shyam, Tollywood